Naveen on Kohli Chants: ఎంజాయ్ చేశాను.. ఫ్యాన్స్ కోహ్లి అని అరవడంపై నవీనుల్ రియాక్షన్-naveen on kohli chants says he enjoyed it ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Naveen On Kohli Chants Says He Enjoyed It

Naveen on Kohli Chants: ఎంజాయ్ చేశాను.. ఫ్యాన్స్ కోహ్లి అని అరవడంపై నవీనుల్ రియాక్షన్

Hari Prasad S HT Telugu
May 25, 2023 02:39 PM IST

Naveen on Kohli Chants: ఎంజాయ్ చేశాను అంటూ ఫ్యాన్స్ కోహ్లి అని అరవడంపై నవీనుల్ కాస్త వింతగా రియక్టయ్యాడు. బుధవారం (మే 24) ముంబై ఇండియన్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో నవీన్ బౌలింగ్ కు వచ్చిన ప్రతిసారీ ఫ్యాన్స్ కోహ్లి నామస్మరణ చేశారు.

నవీనుల్ హక్
నవీనుల్ హక్ (AP)

Naveen on Kohli Chants: విరాట్ కోహ్లి, నవీనుల్ హక్ గొడవ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎంతలా వార్తల్లో నిలిచిందో మనందరికీ తెలుసు. ఆర్సీబీ, లక్నో మ్యాచ్ తర్వాత గొడవ జరిగినా.. ఆ తర్వాత కూడా తరచూ కోహ్లిని నవీనుల్ ఏదో రకంగా కెలుకుతూనే ఉన్నాడు. ఆర్సీబీ ఓడిపోవడాన్నే అతడు ఎంజాయ్ చేశాడు. అదే సమయంలో నవీన్ ఆడిన ప్రతిసారీ స్టేడియంలోని ప్రేక్షకులు కోహ్లి కోహ్లి అని అరుస్తూ అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

బుధవారం (మే 24) ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా కూడా అదే జరిగింది. నవీనుల్ హక్ బౌలింగ్ కు దిగిన ప్రతిసారీ ప్రేక్షకులు కోహ్లి జపం చేశారు. అయితే మ్యాచ్ తర్వాత దీనిపై నవీనుల్ స్పందించాడు. నిజానికి కోహ్లి అంటూ వాళ్లు చేసిన నినాదాలను తాను ఎంజాయ్ చేసినట్లు అతడు చెప్పడం విశేషం.

"దానిని నేను ఎంజాయ్ చేశాను. గ్రౌండ్ లో అందరూ అతని పేరు లేదంటే మరే ప్లేయర్ పేరుతో అరిచినా నాకు నచ్చింది. నా జట్టు కోసం మరింత బాగా ఆడాలన్న తపన నాలో అది కలగజేస్తుంది. బయటి అరుపులను నేను పెద్దగా పట్టించుకోను. నా క్రికెట్ పైనే నేను దృష్టిసారిస్తాను. ఫ్యాన్స్ అరుస్తున్నారా లేదంటే ఎవరైనా ఏదైనా అంటున్నారా అన్నది నాపై ప్రభావం చూపదు. ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ గా అవన్నీ పట్టించుకోకూడదు" అని నవీనుల్ స్పష్టం చేశాడు.

ఎలిమినేటర్ మ్యాచ్ లో నవీన్ 38 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తాను వికెట్ తీసిన ప్రతీసారి నవీనుల్ కూడా కేఎల్ రాహుల్ స్టైల్లో రెండు చెవులూ మూసుకొని సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఇక ఈ సీజన్ లో నవీనుల్ 11 వికెట్లు తీశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం