Ban On Dhoni : ధోనీపై నిషేధం.. ఫైనల్‌లో ఆడతాడా?! ఏం జరగనుంది?
Ban On Dhoni : ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ దశకు దగ్గరలో ఉంది. ఇప్పటికే గుజరాత్ ను ఓడించి.. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ లో అడుగు పెట్టింది. అయితే ఇప్పుడు ఓ విషయం మాత్రం ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 10వ సారి ఐపీఎల్ ఫైనల్ లో అడుగుపెట్టింది. 2021 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే(CSK) ఈ నెల 28వ తేదీన ఫైనల్స్ ఆడనుంది. ఇక ధోనీ సేనను ఢీ కొట్టే జట్టు ఏదని మాత్రం తెలియాల్సి ఉంది. మే 23న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మీద చెన్నై జట్టు గెలిచింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.., గుజరాత్ టైటాన్స్ 157 పరుగులకే ఆలౌట్ అయింది. 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్ లో కాసేపు ధోనీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో చాలాసేపు.. ధోనీ ఇలా మాట్లాడటంపై చర్చ నడుస్తోంది. కావాలనే.. ధోనీ(Dhoni) అంపైర్ల విలువైన సమయాన్ని వృథా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐపీఎల్(IPL) గవర్నింగ్ కౌన్సిల్ సైతం ఆరా తీస్తోంది. ధోనీ నిజంగా తప్పు చేసినట్టుగా తేలితే చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. ధోనీపై ఓ మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉంది. ఆ మ్యాచ్ ఫైనల్ కానుంది.
అసలు ఏం జరిగిందంటే..ఇన్నింగ్స్ చివరి దశలో మతీషా పతిరాణా(matheesha pathirana)ను బౌలింగ్ వేయడానికి అంపైర్లు అంగీకరించలేదు. బౌలింగ్ చేయడానికి బంతిని అందుకున్న ఈ శ్రీలంక బౌలర్‌ను ఆన్ ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, అనిల్ చౌదరి ఆపారు. దీనికి కారణం అతడు తొమ్మిది నిమిషాల గ్రౌండ్‌లో లేడు. విశ్రాంతి తీసుకుని.. బౌలింగ్ చేసేందుకు రావడమే కారణమైంది. దీంతో ధోనీ వచ్చి మాట్లాడాడు. మతీషా వాష్ రూమ్ కి వెళ్లినట్టుగా వివరించినట్టుగా తెలుస్తోంది.
దాదుపు ఐదు నిమిషాల పాటు అంపైర్లతో ధోనీ చర్చలు చేశాడు. అయితే బౌలర్ విశ్రాంతి తీసుకుని వచ్చినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. రూల్ 14.2.3 ప్రకారం.. ఓ ప్లేయర్ మ్యాచ్ జరిగే సమయంలో ఎనిమిది నిమిషాలకు పైగా గ్రౌండ్లో లేకపోతే అతనిపై నిబంధనలు విధించే ఛాన్స్ అంపైర్లకు ఉంది. ఎంత సేపు.. అతడు మ్యాచ్ లో అందుబాటులో లేకుంటే.. అంతసేపు.. అతడు బౌలింగ్, బ్యాటింగ్ చేసేందుకు వీలుండదు. ఇదే విషయం అంపైర్ల వివరించినట్టుగా తెలుస్తోంది. మతీషా తొమ్మిది నిమిషాలు మ్యాచ్ లో లేకపోవడం కారణంగా అంపైర్లు అతడి బౌలింగ్ ను అంగీకరించలేదు. దీంతో ధోనీ వచ్చి మాట్లాడాడు. సుమారు ఐదు నిమిషాల సమయం వృథా అయినట్టుగా గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తోంది.
ఈ విషయంపై కామెంటర్స్ సునీల్ గవాస్కర్, సైమన్ డౌల్ కూడా ప్రస్తావించారు. అంపైర్లతో ఐదు నిమిషాలపాటు వాదనలకు దిగడం ఏ మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో మతీషా(matheesha) ప్లేసులో మరో బౌలర్ బౌలింగ్ చేయకుండా ధోనీ అడ్డుకున్నట్టయిందని పేర్కొన్నారు. దీనికోసం తగిన మూల్యాన్ని చెల్లించే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయంపై ఏం జరుగుతుందో తెలియాలి. ఐపీఎల్ ఫైనల్ కు ముందు చెన్నై జట్టుకు షాక్ తగులుందా? లేదా వేచి చూడాలి.!