Harbhajan Singh: కోహ్లి, బాబర్ కాదు.. అతడే వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్
Harbhajan Singh: కోహ్లి, బాబర్ కాదు.. అతడే వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అని హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భజ్జీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
Harbhajan Singh: ప్రస్తుతం క్రికెట్ లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఎవరు? ఈ ప్రశ్న ఎవరు అడిగినా.. ఓ నలుగురైదుగురి పేర్లు తెరపైకి వస్తాయి. అందులో విరాట్ కోహ్లి మొదటి వ్యక్తి కాగా.. స్టీవ్ స్మిత్, జో రూట్, బాబర్ ఆజం, కేన్ విలియమ్సన్ కూడా ఈ లిస్టులో ఉంటారు. అయితే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రకారం.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ వీళ్లలో ఎవరూ కాదట.
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అని భజ్జీ చెప్పడం విశేషం. బుధవారం (ఏప్రిల్ 12) చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ లో అతడు మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలవగా.. బట్లర్ 36 బంతుల్లో 52 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు.
గతేడాది ఐపీఎల్లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న బట్లర్.. ఈ ఏడాది కూడా టాప్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో బట్లర్ పై భజ్జీ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు అన్ని రకాల బౌలింగ్ లకు తగినట్లుగా ఆడగలడని హర్భజన్ అన్నాడు. బట్లర్ ఈ ఏడాది నాలుగు మ్యాచ్ లు ఆడగా.. అందులో మూడు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇప్పటికే ఐపీఎల్లో 3 వేలకు పైగా రన్స్ చేశాడు.
"జోస్ బట్లర్ ను పొగడటానికి నాకు మాటలు రావడం లేదు. క్రికెట్ బాల్ ను అత్యుత్తమంగా ఆడే బ్యాటర్ అతడు. క్రీజును బాగా ఉపయోగించుకుంటాడు. మంచి టెక్నిక్ ఉంది. పేస్, స్పిన్ బౌలింగ్ లకు మంచి ఫుట్‌వర్క్ కూడా ఉంది. నా వరకు ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో నంబర్ వన్ బ్యాటర్ అతడే" అని హర్భజన్ స్పష్టం చేశాడు. గతేడాది నుంచి బట్లర్ ఊహకందని ఫామ్ లో ఉన్నాడు. 2022లో నాలుగు సెంచరీలు సహా 863 రన్స్ చేశాడు.
సంబంధిత కథనం