Gill on Kohli and Sachin: సచిన్, కోహ్లిలతో తనను పోల్చడంపై శుభ్‌మన్ గిల్ రియాక్షన్ ఇదీ-gill on kohli and sachin says can not define their legacies ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gill On Kohli And Sachin Says Can Not Define Their Legacies

Gill on Kohli and Sachin: సచిన్, కోహ్లిలతో తనను పోల్చడంపై శుభ్‌మన్ గిల్ రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu
May 29, 2023 03:03 PM IST

Gill on Kohli and Sachin: సచిన్, కోహ్లిలతో తనను పోల్చడంపై శుభ్‌మన్ గిల్ రియాక్టయ్యాడు. తనను వాళ్లతో పోల్చడం సరికాదని అన్నాడు. అన్ని ఫార్మాట్లలో దూసుకెళ్తున్న గిల్ ను కొంతకాలంగా సచిన్, కోహ్లిలతో పోలుస్తున్న విషయం తెలిసిందే.

శుభ్‌మన్ గిల్
శుభ్‌మన్ గిల్ (PTI)

Gill on Kohli and Sachin: ఇండియన్ క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత అతని స్థాయిలో పరుగుల యంత్రంగా పేరుగాంచిన వ్యక్తి విరాట్ కోహ్లి. ఏకంగా మాస్టర్ రికార్డులపైనే కన్నేశాడతడు. అయితే జనరేషన్ మారిన కొద్దీ అంతకంటే ఎంతో మెరుగైన ప్లేయర్ వస్తాడన్న వాదనను బలపరుస్తూ కోహ్లి ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తుండగానే శుభ్‌మన్ గిల్ రూపంలో మరో ప్లేయర్ వచ్చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

టెస్టులు, వన్డేలు, టీ20లు, ఐపీఎల్ అనే తేడా లేకుండా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. గతేడాది నుంచి టాప్ ఫామ్ లో ఉన్న అతడు.. ఈ ఏడాది మరింత చెలరేగుతున్నాడు. ఐపీఎల్లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదాడు. 16 మ్యాచ్ లలో ఏకంగా 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. సీఎస్కేతో ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో తనను తరచూ విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ లతో పోలుస్తుండటంపై గిల్ స్పందించాడు. 23 ఏళ్ల వయసులోనే అంత గొప్ప ప్లేయర్స్ తో తనను పోల్చడంపై గిల్ కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. ఈ పోలికలు సరికాదని స్పష్టం చేస్తున్నాడు.

"అందరూ అలా పోలుస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ నేను మాత్రం అలా అనుకోను. సచిన్ సర్, విరాట్ భాయ్, రోహిత్ శర్మ ద్వారా స్ఫూర్తి పొందిన వారి సంఖ్యకు లెక్కే లేదు. మనం 1983 వరల్డ్ కప్ గెలిచి ఉండకపోతే సచిన్ టెండూల్కన్ ఉండేవాడు కాదు. 2011 వరల్డ్ కప్ గెలవకపోతే నేను ఇంతలా స్ఫూర్తి పొందేవాడినో లేదో. అందుకే ఇలాంటివి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. వాళ్ల వారసత్వాలను మనం నిజంగా వర్ణించలేం" అని గిల్ అన్నాడు.

నిజానికి ఈ ఏడాది ఐపీఎల్ ఆడిన తీరు చూసి గిల్ పై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. పరుగుల కోసం అతని ఆకలి, క్రీజులో ప్రశాంతంగా కనిపించే తీరు, వికెట్ల మధ్య పరుగెత్తే వేగం తనను ఎంతగానో ఆకర్షించినట్లు టెండూల్కర్ చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం