Dhoni in IPL: ఐపీఎల్లో చరిత్ర సృష్టించనున్న ధోనీ.. రాయల్స్‌తో మ్యాచ్‌లోనే ఆ అరుదైన రికార్డు
Dhoni in IPL: ఐపీఎల్లో చరిత్ర సృష్టించనున్నాడు ధోనీ. రాయల్స్‌తో మ్యాచ్‌లోనే ఆ అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఇప్పటి వరకూ ఏ కెప్టెన్ కూ సాధ్యం కాని రికార్డు అది.
Dhoni in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ ధోనీకి దాసోహమైన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా నాలుగు టైటిల్స్ సాధించి పెట్టాడు. ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ ఫ్రాంఛైజీకి 200 మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉన్న రికార్డు అది.
బుధవారం (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయే మ్యాచ్ లోనే ధోనీ ఈ రికార్డు అందుకోనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ధోనీకిది 200వ మ్యాచ్ కావడం విశేషం. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ సీఎస్కే కెప్టెన్ గా అతడే ఉన్నాడు. గతేడాది కొన్ని మ్యాచ్ లలో జడేజా కెప్టెన్సీ చేపట్టినా.. మళ్లీ ధోనీ చేతికే పగ్గాలు దక్కాయి.
ఇక 2016, 2017లలో రెండేళ్ల పాటు సీఎస్కేపై నిషేధం విధించడంతో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ టీమ్ తరఫున ఆడాడు. అలా మొత్తంగా ఐపీఎల్లో 213 మ్యాచ్ లకు ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు. అందులో ఇప్పటి వరకూ సీఎస్కే తరఫునే 199 మ్యాచ్ లు కావడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఇప్పటి వరకూ మరెవరికీ సాధ్యం కాని రికార్డును అందుకోబోతున్నాడు.
ఈ రికార్డు మ్యాచ్ కూడా సొంగగడ్డపై చిదంబరం స్టేడియంలో జరగబోతోంది. ధోనీ కెప్టెన్ గా 213 మ్యాచ్ లలో 125 విజయాలు సాధించగా.. 87 ఓడిపోయాడు. అతని విజయాల శాతం 58.96గా ఉంది. ధోనీ మొత్తంగా 237 ఐపీఎల్ మ్యాచ్ లలో 5004 రన్స్ చేశాడు. 2008లో అప్పటి కింగ్స్ పంజాబ్ జట్టుపై ధోనీ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఈ రికార్డు మ్యాచ్ లో తాము గెలుస్తామని ఆశిస్తున్నట్లు సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెప్పాడు.
ధోనీ సీఎస్కేకే కాదు.. ఇండియన్ క్రికెట్ లోనూ ఓ లెజెండ్ అని అతడు అనడం విశేషం. కెప్టెన్ గా 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీకి తాము విజయాన్ని గిఫ్ట్ గా ఇస్తామని ఈ సందర్భంగా జడేజా చెప్పాడు.
సంబంధిత కథనం