International League T20 Schedule: క్రికెట్‌లో మరో లీగ్ ప్రారంభం కాబోతోంది. ఓవైపు తొలి సౌతాఫ్రికా టీ20 (SA20) లీగ్ జరుగుతుండగానే మరోవైపు యూఏఈలో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (IL T20) శుక్రవారం (జనవరి 13) ప్రారంభం కానుంది. ఈ లీగ్ ఫిబ్రవరి 12 వరకూ జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం 30 రోజుల పాటు 34 మ్యాచ్‌లు జరుగుతాయి.,గ్రూప్ స్టేజ్‌లో 30 మ్యాచ్‌లు, ఆ తర్వాత ప్లేఆఫ్స్, ఫైనల్ జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, షార్జా క్రికెట్ స్టేడియాలలో జరుగుతాయి. ఈ లీగ్‌లో మొత్తం ఆరు టీమ్స్ ఆడుతున్నాయి. దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబి నైట్ రైడర్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్, గల్ఫ్ జెయింట్స్, డెజర్ట్ వైపర్స్ టీమ్స్ లీగ్‌లో ఉన్నాయి.,దుబాయ్ క్యాపిటల్స్‌కు రోవ్‌మన్ పావెల్, అబుదాబి నైట్ రైడర్స్‌కు సునీల్ నరైన్, ఎంఐ ఎమిరేట్స్‌కు కీరన్ పొలార్డ్, షార్జా వారియర్స్‌కు మొయిన్ అలీ, గల్ప్ జెయింట్స్‌కు జేమ్స్ విన్స్, డెజర్ట్ వైపర్స్‌కు కొలిన్ మన్రో కెప్టెన్లుగా ఉన్నారు.,ఎప్పుడు? ఎక్కడ చూడాలి?లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం (జనవరి 13) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబి నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ఈ ఐఎల్ టీ20 మ్యాచ్‌లన్నీ జీ5 (ZEE5) యాప్‌లో చూడొచ్చు. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ప్రతి రోజూ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు జరుగుతాయి.,జనవరి 13 నుంచి ఫిబ్రవరి 6 వరకూ ఐఎల్ టీ20 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి 8న తొలి క్వాలిఫయర్, ఫిబ్రవరి 9న ఎలిమినేటర్, ఫిబ్రవరి 10న రెండో క్వాలిఫయర్, ఫిబ్రవరి 12న ఫైనల్ జరుగుతాయి.