SA20 2023 Schedule: సౌతాఫ్రికా టీ20 లీగ్ రేపటి నుంచే.. ఎప్పుడు ఎక్కడ చూడాలి?
SA20 2023 Schedule: సౌతాఫ్రికా టీ20 లీగ్ మంగళవారం (జనవరి 10) నుంచే ప్రారంభం కాబోతోంది. ఆరు టీమ్స్‌తో తొలిసారి జరుగుతున్న ఈ లీగ్‌లోని మ్యాచ్‌లను ఎప్పుడు ఎక్కడ చూడాలి?
SA20 2023 Schedule: క్రికెట్‌లో మరో లీగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఐపీఎల్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఐపీఎల్‌ను తలపించేలా, ఆ లీగ్‌లోని ఫ్రాంఛైజీల టీమ్స్‌తోనే సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) మంగళవారం (జనవరి 10) నుంచి ప్రారంభమవుతోంది.
ఆరు టీమ్స్‌తో జరగనున్న ఈ లీగ్ ఫిబ్రవరి 11 వరకూ సాగనుంది. డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్, ఎంఐ కేప్ టౌన్, పార్ల్ రాయల్స్ ఈ లీగ్‌లో ఆడనున్నాయి.
ఈ టీమ్స్‌ను చూస్తే ఏ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఏ టీమ్‌ను కొనుగోలు చేసిందో అర్థమై ఉంటుంది. ఎంఐ కేప్‌టౌన్‌కు రషీద్ ఖాన్, పార్ల్ రాయల్స్‌కు డేవిడ్ మిల్లర్, డర్బన్ సూపర్ జెయింట్స్‌కు డికాక్, జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ఫాఫ్ డుప్లెస్సి, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు ఏడెన్ మార్‌క్రమ్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు వేన్ పార్నెల్ కెప్టెన్లుగా ఉండనున్నారు.
లీగ్ స్టేజీలో 30 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. డర్బన్, కేప్‌టౌన్, పార్ల్, జోహనెస్‌బర్గ్‌లలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ మంగళవారం (జనవరి 10) ఎంఐ కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్ మధ్య జరగనుంది.
ఎప్పుడు ఎక్కడ చూడాలి?
భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ సాయంత్రం 5, రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. సౌతాఫ్రికా లీగ్‌ను ఇండియాలో జియో సినిమా యాపలో ప్రత్యక్షంగా చూడొచ్చు. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 7 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 8, 9 తేదీల్లో సెమీఫైనల్స్, ఫైనల్ ఫిబ్రవరి 11న జరుగుతుంది.
సంబంధిత కథనం