Sundar Pichai On FIFA : గూగుల్లో ఫిఫా రికార్డు.. 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్
Google Search On FIFA : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ అత్యంత ఆసక్తికరంగా ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం సాధించింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే..గూగుల్లో ఫిఫా వరల్డ్ కప్ రికార్డు బద్దలు కొట్టింది. గూగుల్ సెర్చ్ 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్ నమోదు చేసింది.
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ గురించి ప్రపంచమంతా వేతికింది. ఎప్పుడూ లేని విధంగా గూగుల్ సెర్చ్ 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ప్రపంచమంతా ఒకే విషయం గురించి వెతికిందని అన్నారు. నెల రోజులపాటు పండుగలా సాకర్ సాగింది. ఆదివారంతో ముగిసింది. ఫ్రాన్స్ పై 4-2 పెనాల్టీ షూటౌట్ తో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ సాధించింది. ఫిఫా వరల్డ్ కప్ గురించే.. ప్రపంచమంతా సెర్చ్ చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు.
'#FIFAWorldCup ఫైనల్ సమయంలో గత 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్ నమోదు చేసింది. ప్రపంచం మెుత్తం ఒక విషయం గురించి వెతుకుతున్నట్టుగా ఉంది. ఇది గొప్ప ఆటల్లో ఒకటి. రెండు జట్లు అద్భుతంగా ఆడాయి.' అని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.
సుందర్ పిచాయ్ ట్వీట్ పై లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ పోడ్‌క్యాస్ట్ హోస్ట్, శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్మా స్పందించారు. ఇది ఫుట్ బాల్ గొప్పదనమని పేర్కొన్నారు. ఒక బిలియన్ మందికి పైగా ప్రజలు తమకు ఆటపై ఉన్న ప్రేమతో ఏకమై కనిపించారు. గ్లోబల్ గేమ్ ఫుట్ బాల్ అంటూ.. కామెంట్ చేశారు.
ఇక ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ను ప్రపంచమంతా ఉత్కంఠతో చూసింది. గోల్స్ సమం కావడంతో మ్యాచ్ నిర్ణీత సమయమే కాకుండా అదనపు సమయం ఇచ్చినప్పటికీ ఫలితం 3-3 గానే ఉండటంతో ఇరుజట్లు ఫెనాల్టీ అవకాశాలిచ్చారు. ఈ అవకాశాన్ని అర్జెంటీనా అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది. ఫలితంగా మూడో సారి విశ్వవిజేతగా నిలిచింది. 3-3(4-2) తేడాతో అర్జెంటీనా కప్పును సొంతం చేసుకుంది. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ ఫెనాల్టీ ,కిక్స్‌లో అద్భుతంగా రెండు గోల్స్ ఆపి మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు.
సంబంధిత కథనం