Ashwin on Kohli: ఆ ఒక్క బాల్ ఆడటానికి కోహ్లి ఏడు ఆప్షన్లు ఇచ్చాడు.. పాక్ మ్యాచ్ గుర్తు చేసుకున్న అశ్విన్-ashwin on kohli says virat gave him 7 options to play that last ball againt pakistan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin On Kohli: ఆ ఒక్క బాల్ ఆడటానికి కోహ్లి ఏడు ఆప్షన్లు ఇచ్చాడు.. పాక్ మ్యాచ్ గుర్తు చేసుకున్న అశ్విన్

Ashwin on Kohli: ఆ ఒక్క బాల్ ఆడటానికి కోహ్లి ఏడు ఆప్షన్లు ఇచ్చాడు.. పాక్ మ్యాచ్ గుర్తు చేసుకున్న అశ్విన్

Hari Prasad S HT Telugu
Jun 29, 2023 11:08 AM IST

Ashwin on Kohli: ఆ ఒక్క బాల్ ఆడటానికి కోహ్లి ఏడు ఆప్షన్లు ఇచ్చాడంటూ గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాక్ మ్యాచ్ గుర్తు చేసుకున్నాడు అశ్విన్. చివరి బంతికి పరుగు తీసి ఆ మ్యాచ్ ను అశ్విన్ గెలిపించిన విషయం తెలిసిందే.

చివరి బంతికి సింగిల్ తీసిన తర్వాత అశ్విన్ గెలుపు సంబరం
చివరి బంతికి సింగిల్ తీసిన తర్వాత అశ్విన్ గెలుపు సంబరం (AP)

Ashwin on Kohli: నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ జరగడం అంటే ఏంటో నిరూపించింది గతేడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్. ఇందులో చివరి బంతికి అశ్విన్ పరుగు తీసి టీమిండియాను గెలిపించాడు. అయితే అంతకుముందు అసలు మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్న సమయంలో విరాట్ కోహ్లి ఆడిన కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఎవరూ అంత త్వరగా మరచిపోరు.

ఆ మ్యాచ్ లో కోహ్లి 53 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్ చివరి బంతి ఆడే అవకాశం తనకు రావడంపై అశ్విన్ తాజాగా స్పందించాడు. ఐసీసీ వెబ్‌సైట్ తో మాట్లాడుతూ.. ఆ చివరి క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఆ ఒక్క బాల్ ఆడటానికి కోహ్లి తనకు ఏడు ఆప్షన్స్ ఇచ్చినట్లు అశ్విన్ చెప్పడం విశేషం.

"వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై చివరి బాల్ ఆడటానికి నేను క్రీజులోకి వచ్చినప్పుడు ఆ ఒక్క బాల్ ఆడటానికి విరాట్ కోహ్లి నాకు ఏడు ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ సమయంలో నేను కోహ్లి కళ్లలోకి చూసినప్పుడు అతడు మరో లోకంలో ఉన్నట్లు కనిపించాడు. విరాట్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ అది. అతి గొప్ప మ్యాచ్ లలో అదీ ఒకటి" అని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.

ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. చివరి బంతికి నాలుగు వికెట్లతో గెలిచింది. అయితే ఆ మ్యాచ్ 19వ ఓవర్లో చివరి రెండు బంతులకు విరాట్ కొట్టిన సిక్స్ లు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. ఎంతో ఒత్తిడిలోనూ అతడు నేరుగా బౌలర్ తల మీదుగా ఒకటి, ఫైన్ లెగ్ మీదుగా మరొకటి సిక్స్ లు కొట్టడంతో ఇండియాకు మ్యాచ్ పై ఆశలు చిగురించాయి.

ఒక దశలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో హార్దిక్ పాండ్యా (40)తో కలిసి విరాట్ ఐదో వికెట్ కు 113 పరుగులు జోడించి టీమిండియాను ఆదుకున్నాడు. అంతేకాదు చివరి వరకూ క్రీజులో ఉండి చారిత్రక విజయాన్ని అందించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం