Papankusha ekadashi: మూడు తరాల పాపాలను తొలగించే పాపాంకుశ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? దీని విశిష్టత ఏంటి?
Papankusha ekadashi: ఈ సంవత్సరం పాపాంకుశ ఏకాదశి వ్రతం అక్టోబర్ 13, 14 తేదీలలో రెండు రోజుల పాటు ఆచరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా జీవితంలోని అన్ని పాపాల నుండి ఉపశమనం పొందుతారని మత విశ్వాసం.
ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు పాపాంకుశ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజు విష్ణువు ఆరాధనకు అంకితమైనదిగా పరిగణిస్తారు.
దృక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం పాపాంకుశ ఏకాదశి వ్రతం రెండు రోజుల పాటు ఆచరిస్తారు. అక్టోబర్ 13, 14 తేదీల్లో పాపాంకుశ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషికి అన్ని పాపాలు, బాధలు తొలగిపోతాయని మత విశ్వాసం. శ్రీ హరివిష్ణువు ఆరాధన వలన జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయి. ఏకాదశి వ్రతాన్ని పాటించడంతో పాటు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి.పాపాంకుశ ఏకాదశి వ్రతం ఖచ్చితమైన తేదీ, ప్రాముఖ్యత, నియమాలను తెలుసుకుందాం.
పాపాంకుశ ఏకాదశి ఎప్పుడు?
దృక్ పంచాంగ్ ప్రకారం పాపాంకుశ ఏకాదశి 13 అక్టోబర్ 2024న ఉదయం 09:08 గంటలకు ప్రారంభమై 14 అక్టోబర్ 2024న ఉదయం 06:41 గంటలకు ముగుస్తుంది. కుటుంబ జీవితం ఉన్నవారు అక్టోబర్ 13న పాపాంకుశ ఏకాదశి ఉపవాసాన్ని పాటించవచ్చు. అదే సమయంలో వైష్ణవులు అక్టోబర్ 14న పాపాంకుశ ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తారు.
పరాన టైమింగ్
దృక్ పంచాంగ్ ప్రకారం సెప్టెంబర్ 13న పాపాంకుశ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు అక్టోబర్ 14వ తేదీ మధ్యాహ్నం 01:16 నుండి 03:46 వరకు ఉపవాసం విరమించవచ్చు. అదే సమయంలో అక్టోబర్ 14న ఉపవాసం పాటించేవారు అక్టోబర్ 15వ తేదీ ఉదయం 06.22 నుండి 08.40 గంటల వరకు ఉపవాసాన్ని విరమించుకోవచ్చు.
పాపాంకుశ ఏకాదశి ఎందుకు ముఖ్యమైనది?
మత విశ్వాసాల ప్రకారం పాపాంకుశ ఏకాదశి రోజున పద్మనాభుడిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల సర్వపాపాలు నశిస్తాయి. అదే సమయంలో శ్రీ హరి విష్ణువు సంతోషించి, సాధకుడికి ఆనందం, శ్రేయస్సు, సంపదలను అనుగ్రహిస్తాడు. అంతే కాదు పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా 1000 అశ్వమేధ యాగాలు, 100 సూర్య యాగాలకు సమానమైన శుభ ఫలితాలు పొందుతారు.
దసరా మరుసటి రోజు ఈ ఏకాదశి వచ్చింది. పాపంకుశ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మూడు తరాల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ ఉపవాస దీక్ష ఆచరించనాడు యమలోక చిత్రహింసలు భరించాల్సిన అవసరం లేదు. ఈ ఉపవాసం ఆచరించే వాళ్ళు నేలపై పడుకోవాలి. ఎవరికి చెడు చేయకూడదు. మనసులోనూ చెడు తలంపులు రాకూడదు. రాత్రిపూట మేల్కొని ఉండాలి. ఈ ఏకాదశి నాడు విష్ణువుకు తేనె సమర్పించడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్