వారఫలాలు- ఈ రాశుల వారికి కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడతాయి-weekly horoscope in telugu september 8th to september 14th rasi phalalu check zodiac signs predictions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు- ఈ రాశుల వారికి కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడతాయి

వారఫలాలు- ఈ రాశుల వారికి కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడతాయి

HT Telugu Desk HT Telugu
Sep 08, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వారఫలాలు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ వరకు
వారఫలాలు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ వరకు

రాశి ఫలాలు (వార‌ ఫలాలు) 08.09.2024 నుంచి 14.09.2024 వ‌ర‌కు

మాసం: భాద్ర‌ప్ర‌ద‌, సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

ఈ వారం మేష రాశి వారికి మిశ్ర‌మ ఫ‌లితాలు ఉన్నాయి. కాబ‌ట్టి కీల‌క వ్య‌వ‌హారాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఆకస్మిక ధననష్టం ఉంది. ఆరోగ్యం విష‌యంలో ఇబ్బందులు ఉండ‌దు. కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ఇప్ప‌టికే మొద‌లుపెట్టిన కొన్ని ప‌నులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. గ‌ణ‌ప‌తి దేవాల‌యాన్ని సంద‌ర్శించండి. మంచి జ‌రుగుతుంది.

వృషభం

వృష‌భ రాశి వారికి మంచి ఫ‌లితాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలు చేస్తారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబసౌఖ్యం ఉంది. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఇష్ట‌దేవ‌తారాధ‌న మంచి స‌త్ఫ‌లితాలు అందిస్తాయి.

మిథునం

గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలతో ముందు అడుగు వేస్తారు. మీ ప‌నుల ప‌ట్ల‌ బంధు, మిత్రులు గౌరవం వ్య‌క్తం చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సత్కారాల‌లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్య మిస్తారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే సూచ‌న‌లు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. గ‌ణ‌ప‌తి ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు.

కర్కాటకం

వారఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవ‌కాశాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది . కుటుంబంలో స్వ‌ల్ప‌ మార్పులు సూచితం. ఒక మంచి అవకాశం మీ చేజారిపోయే అవ‌కాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా నుండ‌టం అవసరం. కొన్ని కీల‌క కార్య‌క్ర‌మాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొంద గలుగుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థిక విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండండి. అమ్మ‌వారి ధ్యానం మీకు మంచి ఫ‌లితాలు అందిస్తుంది.

సింహం

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆనందంగా గ‌డుపుతారు.

కన్య

ఆరోగ్యం గూర్చి జాగ్రత్త పడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్ట మేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా కొత్త‌ సమస్యల నెదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. న‌వ‌గ్ర‌హ శ్లోకాలు ప‌ఠించండి. స‌త్ఫ‌లితాలు ఉన్నాయి.

తుల

ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శ‌త్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని ఆరాధించండి. మంచ‌చి జ‌రుగుతుంది.

వృశ్చికం

కొన్ని విష‌యాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు . అధికారుల వ‌ల్ల గౌర‌వం పొందుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. అనుకోకుండా కుటుంబంలో కలహా లేర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధన నష్టం జరుగకుండా జాగ్రత్త పడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ప్రముఖ దేవాల‌యాల‌ను సంద‌ర్శించండి. మంచి జ‌రుగుతుంది.

ధనుస్సు

ధ‌నుస్సు రాశి వారికి మిశ్ర‌మ ఫ‌లితాలు అందుతాయి. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్ప‌డే అవకాశముంటుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధననష్టం జరగకుండా జాగ్రత్త పడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్య మేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. దైవ కార్య‌క్రమాల్లో పాల్గొంటారు. మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఆర్థిక విజ‌యం పొందుతారు.

మకరం

కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీలమూలకంగా లాభం వుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగును. ఆరోగ్యం మెరుగవు తుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. శివారాధ‌న మంచి ఫ‌లితాలు ఇస్తుంది. శివాల‌యాన్ని సంద‌ర్శించి అభిషేకం చేయండి.

కుంభం

కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుదురు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీలమూలకంగా లాభం వుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగును. ఆరోగ్యం మెరుగవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించండి. మంచి జ‌రుగుతుంది.

మీనం

కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు. దాయకంగా ఉంటుంది. వ్యవసాయరంగంలోని వారికి లాభం ఉంటుంది. విష్ణు స‌హ‌స్ర నామ పారాయ‌ణం చేయండి. మంచి జ‌రుగుతుంది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000