Friday Motivation: ఆనందంగా జీవించాలంటే మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొలపండి-awaken the inner peace within you to live happily in life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation: ఆనందంగా జీవించాలంటే మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొలపండి

Friday Motivation: ఆనందంగా జీవించాలంటే మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొలపండి

Haritha Chappa HT Telugu
Jul 05, 2024 10:02 AM IST

Friday Motivation: ప్రతి మనిషిలో మంచీ, చెడు రెండు లక్షణాలు ఉంటాయి. మనం ఏ విధంగా ప్రవర్తించాలనుకుంటామో అదే బయటికి వస్తుంది. అలాగే మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొలపండి.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Unsplash)

ఉన్నదాంట్లోనే సర్దుకుపోవడం, అందరితో నవ్వుతూ మాట్లాడడం, పరిధి దాటి ఆలోచించకపోవడం, ప్రశాంతంగా జీవించాలనుకోవడం... ఇవన్నీ మంచి లైఫ్‌ను అందిస్తాయి. మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొలిపితేనే మీరు జీవితాంతం సంతోషంగా జీవించగలరు. ప్రతి వ్యక్తులు తమలో ఉన్న శాంతికాముకుల్ని మేల్కొల్పితేనే వారి జీవితం సవ్యంగా సంతోషంగా సాగుతుంది. దీనికోసం మీరు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. మరికొన్ని అలవాటు చేసుకోవాల్సి కూడా రావచ్చు.

ప్రశాంతంగా జీవించడానికి మిమ్మల్ని మీరు అంగీకరించాలి. అంటే ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితులను అంగీకరించాలి. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం, నీచంగా చూసుకోవడం మానేయాలి. లక్ష రూపాయలు సంపాదించే వాడిని చూసి మీలో మీరు కుళ్ళు కోవడం, మిమ్మల్ని తక్కువగా చూసుకోవడం మానుకోవాలి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్వీయ అంగీకారం ఎంతో మేలు చేస్తుంది. 

ప్రతికూల లక్షణాలను తగ్గిస్తుంది. కొంతమంది తాము పొడవుగా లేరని, తెల్లగా లేమని, ఎక్కువ సంపాదించడం లేదని తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. ఇదే మీకు శాంతిని దూరం చేస్తాయి. ఇలాంటి ఆలోచనలే మీ శాంతిని దూరం చేస్తాయి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే స్వీకరించడం మొదలు పెట్టండి. మీ చుట్టూ ఉన్న జీవితం కూడా సంతోషంగా అనిపిస్తుంది.

ప్రతి ఒక్కరి జీవితంలో చెడుతో పాటు మంచి కూడా ఉంటుంది. మీరు మంచిని మాత్రమే చూడడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో విలువైనవిగా భావించే వాటిని ఒక చోట రాసుకోండి. అది కుటుంబం, స్నేహితులు, మీరు తినే ఆహారం, మీ ఇల్లు, ఉద్యోగం, మీ చుట్టూ ఉండే ప్రకృతి ఏదైనా కావచ్చు. ఏదైతే మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుందో వాటిని ఒక జాబితాగా తయారు చేసుకుని ఉంచండి. మీకు బాధగా అనిపిస్తున్నప్పుడు లేక మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నప్పుడు మీ జీవితం మీకు ఇచ్చిన పాజిటివ్ విషయాలను తలచుకోండి. ముందుగా రాసి పెట్టుకున్న జాబితాను తీసి చదువుతూ ఉండండి.

కొన్ని విషయాలను మనం మార్చలేం. పొట్టిగా పుట్టిన వారు పొడవుగా మారలేరు. అలాగే పొడవుగా పుట్టిన వారు పూర్తిగా మారలేరు. మనం మార్చలేని విషయాల గురించి పదేపదే ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు. మనం నియంత్రించే వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. మన చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించడం మానేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

మైండ్ ఫుల్‌నెస్, ధ్యానం వంటివి అంతర్గత శాంతిని పెంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి రోజుల్లో కనీసం అరగంట పాటు మైండ్ ఫుల్ నెస్ ను ప్రాక్టీస్ చేయండి. ఈ క్షణం మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించండి. మీ చుట్టూ ఉన్న సానుకూల అంశాలను చూడండి. అందమైన ప్రకృతిలో గడిపేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా అధిక ఆలోచనలను తగ్గించండి. మీరు జీవించి ఉన్న రోజును ఆనందంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి. రేపటి గురించి ఆలోచిస్తూ నేటి రోజును నాశనం చేసుకోవద్దు.

కారం, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తినడం మాని సాత్విక ఆహారాన్ని తినడం ప్రారంభించండి. పండ్లు ఎక్కువగా తినండి. రోజుకి ఒక డార్క్ చాక్లెట్ ముక్కను తినేందుకు ప్రయత్నించండి. ఇవన్నీ మీకు అంతర్గత శాంతిని ఇస్తాయి.

Whats_app_banner