వార ఫలాలు.. ఈ రాశుల వారికి అన్ని రంగాల్లో అద్భుత విజయం, ఆకస్మిక ధనలాభం-weekly horoscope in telugu march 3rd to march 9th check zodiac signs result future prediction ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Weekly Horoscope In Telugu March 3rd To March 9th Check Zodiac Signs Result Future Prediction

వార ఫలాలు.. ఈ రాశుల వారికి అన్ని రంగాల్లో అద్భుత విజయం, ఆకస్మిక ధనలాభం

HT Telugu Desk HT Telugu
Mar 03, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. మార్చి 3వ తేదీ నుంచి మార్చి 9 వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

మార్చి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వారఫలాలు
మార్చి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వారఫలాలు (freepik)

రాశిఫలాలు (వార ఫలాలు) 03.03.2024 నుండి 09.03.2024 వరకు

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : మాఘం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధు మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. వాగ్వివాదములకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం అనుకూలించును. అన్ని విధాలుగా ఈ వారం మీకు సత్ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలం ఉంటుంది. మేష రాశి మరింత శుభ ఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. బంధు మిత్రులతో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతనంగా పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ప్రయాణాలెక్కువ చేస్తారు. రుణలాభం పొందుతారు. మీరు చేసే ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేసే పనులలో ఇబ్బందులుంటాయి. క్రొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులు ఉంటాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

వార ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. కుటుంబ విషయాల్లో మార్పులుంటాయి. బంధుమిత్రులతో అభిప్రాయభేదములు రాకుండా చూసుకోవాలి. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు రుణ ప్రయత్నం చేస్తారు. అన్ని వేళలా సహనం వహించుట మంచిది. మీరు చేయు ప్రయత్నాలకు ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ద వహించాలి. అనవసర ధన వ్యయంతో రుణప్రయత్నాలు చేస్తారు. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసికంగా ఆనందముగా గడిపెదరు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్యనారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. పిల్లలకు సంతోషాన్ని కలుగచేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు మిత్రులను కలుస్తారు. ఇతరులకు హాని తలపెట్టు పనులకు దూరంగా ఉంటారు. కుటుంబముతో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ఈవారం మీరు చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇచ్చే సూచనలు అధికముగా ఉన్నాయి. విష్ణు సహస్రనామం పారాయణ, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

వార ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిన ధననష్ట మేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య సమస్యలకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. సంతానపరంగా మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబములో మనశ్శాంతి లోపిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రహస్య శత్రుబాధలుండే అవకాశముంది. మంచి వారితో స్నేహం చేస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండుట మంచిది. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయమయ్యే అవకాశం. రుణ ప్రయత్నాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలున్నాయి. స్త్రీలతో గొడవపడే అవకాశాలుంటాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలుంటాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడును. అనవసర వ్యయప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. మంచివారితో స్నేహం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. పేరు ప్రతిష్టలుంటాయి. మానసికాందోళన అధికమగును. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. కుటుంబముతో ఆనందముగా ఉంటారు. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగముంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆకస్మిక ధనలాభయోగమున్నది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రయాణాలు వల్ల లాభం చేకూరును. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందెదరు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel