Today Horoscope Telugu : ఆ రాశుల వారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి-check your astrology prediction for october 19th 2023 thursday check all zodiac signs in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Horoscope Telugu : ఆ రాశుల వారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి

Today Horoscope Telugu : ఆ రాశుల వారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి

HT Telugu Desk HT Telugu
Oct 19, 2023 02:10 AM IST

Today Horoscope In Telugu : ఈరోజు రాశి ఫలాలు తేదీ అక్టోబరు 19, 2023 గురువారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 19. 10.2023, వారం: గురువారం, తిథి : పంచమి, నక్ష్మత్రం : జ్యేష్ట, మాసం : ఆశ్వయుజం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రతీ విషయాన్ని అర్ధం చేసుకొని వ్యవహరించుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మధ్యస్థముగా ఉంటుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. మౌనంగా వ్యవహరించుట మంచిది. అవసరాలకు తగినట్లుగా ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. అధికారులు, పెద్దలతో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం ఉందకుండా చూసుకోవాలి. వాహన సౌఖ్యం. కుటుంబముతో అభిపప్రాయభేదాలేర్చడు సూచన. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథునరాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పై అధికారులచే ఒత్తిడులుంటాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. వివాహాది శుభయత్నాల్లో మంచి జరగగలదు. ఇంటి పనులు పూర్తి చేసుకుంటారు. అవకాశలు కలసివస్తాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మధ్యమ ఫలితాలుంటాయి. మీరు మీ శత్రువులతో కొంత జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబంతో భేదాభిప్రాయములు ఏర్పడును. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసెదరు. విద్యార్థులకు మధ్యస్థం. శివపార్వతులు అర్జానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలి. ఉన్నత వర్గంతో సంబంధ బాంధవ్యాలు ఏర్చడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇతరుల సహాయం తీసుకొనుట మంచిది. వివాహ శుభకార్య ప్రయత్నాలపై పనులు చురుకుగా సాగుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్న పనులు నెమ్మదిగా పూర్తి అవుతాయి. వాగ్వివాదములకు దూరంగా ఉండాలి. వస్తు, వాహన విషయాలలో జాగ్రత్తలు అవసరం. స్థిరమైన ఆలోచనలు చేసుకుంటారు. గొడలకు వెళ్ళకుండా లౌక్యంగా వ్యవహరించుకోవాలి. మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తమునుండి అనుకూలంగా ఉంది. పట్టుదలతో మీరనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇతరుల్ని సహాయం కోరుటకు ఇష్టపడరు. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఒంటరితనమును కోరుకుంటారు. వ్యక్తిగతమైన విషయాల్లో దాపరికం పాటించుకోండి. మీ ప్రవర్తన విషయంలో సందేహాలు ఏర్పడవచ్చు. శివపార్వతులు అర్జానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృళ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులను కించపరుస్తూ మాట్లాడకండి. పనులకు కొంత ఆటంకాలుంటాయి. అనారోగ్య బారినపడే సూచనలున్నాయి. ఒప్పందాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఖర్చులను తగ్గించుకోవాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో గుర్తింపు ఉంటుంది. అన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వ్యాపారస్తులకు అనుకూల సమయం. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకముగా సాగుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శెనగలను దానమివ్వడం మంచిది. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఆర్థికాభివృద్ధి గతం కంటే అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు దూరమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపులు ఏర్పడతాయి. వాహన, భూ గృహ విషయాల ఏర్పాట్లు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో మార్పులు వస్తాయి. శివపార్వతులు అర్ధానారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. అత్యసవర సమయాల్లో బంధుమిత్రుల సహకారాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు అవసరం. పని ఒత్తిడులు తగ్గుతాయి. కొన్ని పనులు ఆగి ముందుకు సాగుతాయి. కుటుంబములో అనవసర విషయాలు, చర్చలు చికాకు కలుగచేస్తాయి. స్త్రీలు అనారోగ్యమునకు గురవుతారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉంది. ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరినీ అతిగా నమ్మకుండా వ్యవహరించుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఒత్తిడి ఉండగలదు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తలు అవసరం. స్థిర, చరాస్తుల వ్యవహారములకు దూరంగా ఉండంది. వాహన వాడకంతో జాగ్రత్తలు అవసరం. సమస్యలను ధైర్యంగా ఎదుర్నోవాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.