Shani Remedies: ఈ రాశులపై శని చెడు ప్రభావాలు.. ఈ పరిహారాలు పాటిస్తే శని అనుగ్రహం పొందుతారు-next ten months these zodiacs sings face elinati shani effect follow these remedies for shani blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Remedies: ఈ రాశులపై శని చెడు ప్రభావాలు.. ఈ పరిహారాలు పాటిస్తే శని అనుగ్రహం పొందుతారు

Shani Remedies: ఈ రాశులపై శని చెడు ప్రభావాలు.. ఈ పరిహారాలు పాటిస్తే శని అనుగ్రహం పొందుతారు

Gunti Soundarya HT Telugu
Feb 29, 2024 09:56 AM IST

Shani pariharalu: రానున్న పది నెలలు ఈ రాశుల వారిపై శని వక్ర దృష్టి పడనుంది. ఫలితంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని చెడు ప్రభావం తగ్గించుకునేందుకు ఈ పరిహారాలు పాటిస్తే మంచిది.

ఈ రాశులపై శని చెడు ప్రభావాలు
ఈ రాశులపై శని చెడు ప్రభావాలు

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. నవగ్రహాలలో క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శని రాశి చక్రం మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. నెమ్మదిగా కదిలే గ్రహాలలో శని గ్రహం ఒకటి. అందుకే మొత్తం 12 రాశి చక్రాలు సంచరించేందుకు రెండున్నర సంవత్సరాలు పడుతుంది.

గతేడాది శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఒక ప్రవేశం చేశాడు. ఈ ఏడాది మొత్తం ఇదే రాశిలో సంచరిస్తాడు. 2025 మార్చి 29న మీనరాశి ప్రవేశం చేస్తాడు. ప్రస్తుతం శని అస్తంగత్వ దశలో ఉన్నాడు. మార్చి నెలలో శని ఉదయించబోతున్నాడు. మార్చి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశిలో సంచరించునున్న శని చూపు కొన్ని రాశుల మీద పడబోతుంది.

ఈ రాశులపై శని వక్ర కన్ను

కుంభ రాశిలో శని ఉండటం వల్ల సాడే సతీ, దయ్యా ప్రభావం కుంభం, మకరం, మీనరాశి పై ఉంటుంది. అదే సమయంలో వృశ్చికం, కర్కాటక రాశి వారిపై శని దయ్యా ప్రభావం కనిపిస్తుంది. వీటినే ఏలినాటి శని, అర్థాష్టమ శని అంటారు.

ఏలినాటి శని చాలా సమస్యలు కలిగిస్తుంది. ఈ ప్రభావం ఉన్న జాతకులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని కదలిక రాబోయే 10 నెలలపాటు ఈ ఐదు రాశులను ఇబ్బంది పెడుతుంది. జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శని సంచారం వల్ల వృత్తి, ఆర్థిక, ప్రేమ జీవితంలో ఒడిదుడుకులకు దారి తీస్తుంది. శని వక్ర దృష్టి పడకుండా ఉండడం కోసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శని దేవుడు చెడు ప్రభావాలను తగ్గించుకోవచ్చు.

ఏలినాటి శని ప్రభావం తగ్గించుకునే పరిహారాలు

ఏలినాటి శని ప్రభావాలు తగ్గించుకోవడం కోసం శనివారం రోజు నల్లనువ్వులు, నలుపు రంగు వస్తువులు దానం చేయాలి. నలుపు రంగు శనికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి శనివారం హనుమంతుడిని ఆరాధించాలి. ఎందుకంటే దేవుళ్ళలో శని ప్రభావం పడని వారిలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆయన అనుగ్రహం ఉంటే శని చెడు ప్రభావం తగ్గిపోతుంది.

శివుడిని ఆరాధించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గించుకోవచ్చు. శివునికి పరమ భక్తుడు శని. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108సార్లు జపించడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందుతారు. నల్ల మినప్పప్పు, ఆవనూనె, నలుపు రంగు వస్త్రాలు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.

శని సాడే సతీ, దయ్యా ప్రభావాలు తగ్గించుకోవడం కోసం ప్రతి శనివారం రావిచెట్టు, శమీ వృక్షాన్ని పూజించాలి. రావి శమీ చెట్ల కింద నెయ్యి దీపం వెలిగించి శని మంత్రాలు పఠించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది.

ఏలినాటి శని గ్రహ ప్రభావం తగ్గించుకోవడం కోసం లక్ష్మీనరసింహస్వామి, సత్యనారాయణ స్వామి వారిని పౌర్ణమి రోజు, ప్రదోష నాడు పూజిస్తే ప్రభావం తొలగిపోతుంది.

శని ప్రభావం తప్పించుకోవడం కోసం పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా తప్పులు చేయొద్దు. అలా చేయడం వల్ల శని అనుగ్రహం లభించదు. శనివారం సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా పఠించాలి.

శనికి ఇష్టమైన శనగలు, బెల్లం, నువ్వులు వంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. ఈ పనులు చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం పెరిగి మీ జాతకంలోని ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాలు తగ్గుముఖం పడతాయి.