Vastu Tips for Money in Home : డబ్బులు ఉంచే లాకర్ ముందు అది పెడితే సంపద రెట్టింపు అవుతుందట..
Vastu Tips for Money in Home : ఎంత కష్టపడతామో అంత సంపదాన మనకి వస్తుందా అంటే చెప్పలేము. ఒక్కోసారి మీ కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా.. మీ సంపాదన కూడా మీ దగ్గర ఉండదు. ఆ సమయంలో లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ధనం మీ దగ్గరే ఉండాలంటే.. మీరు లక్ష్మీదేవిని ఇలా ప్రసన్నం చేసుకోవచ్చు.
Vastu Tips for Money in Home : విశ్వంలో ప్రతిదానికీ శక్తి స్థాయి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కనిపించే ప్రతిదానిలో ఏదో ఒక రకమైన శక్తి ఉంటుందని.. అది పాజిటివ్ లేదా నెగటివ్ ఎనర్జీ అవుతుందని తెలిపింది. వాస్తు శాస్త్రం అనేది భారతీయ వాస్తుశిల్పం పురాతన పద్ధతి. దీని ప్రస్తావన మనమందరం ఎప్పుడో విన్నాం. కానీ వాస్తు శాస్త్రం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
విశ్వంలో ప్రతిదానికీ ఏదొక శక్తి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అది పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి.. పాజిటివ్ ఇచ్చేవాటికి ఎక్కువగా దగ్గరగా ఉండాలని.. నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేవాటికి దూరంగా ఉండాలి అంటుంది వాస్తు శాస్త్రం. అయితే మీ ఇంట్లో సంపద, శ్రేయస్సును పెంచుకోవడానికి మీరు కొన్ని సులభమైన వాస్తు చిట్కాలను పాటించవచ్చని వాస్తు శాస్త్రం చెప్తుంది. అవేంటో మీరు తెలుసుకుని.. బెనిఫిట్స్ పొందండి.
* ఇంటి ప్రధాన ద్వారం శక్తివంతమైనదిగా చెప్తారు. ఈ ప్రధాన ద్వారం ద్వారానే.. శక్తి ఇంటి లోపలికి వెళుతుంది. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
* వాస్తు శాస్త్రం ప్రకారం.. ఊదా రంగు సంపదను సూచిస్తుంది. డబ్బును ఆకర్షించడానికి ఇంటి గోడలకు ఊదా రంగు వేస్తే మంచిది.
* ముదురు రంగు పెయింట్ తరచుగా ఇంటి గోడలపై ఆకర్షణీయంగా కనిపించదు. కాబట్టి మనీ ప్లాంట్‌ను పర్పుల్ రంగు కుండిలో ఉంచవచ్చు.
* మీరు నగదు లేదా ఇతర విలువైన వస్తువులను ఉంచే లాకర్ లేదా అల్మారా ముందు అద్దం ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇలా చేయడం వల్ల లాకర్‌లో ఉంచిన డబ్బు రెట్టింపు అవుతుంది.
* ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి.. ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి విగ్రహం, చిత్రాన్ని ఉంచవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
Disclaimer : ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, కచ్చితమైనదని హిందూస్తాన్ టైమ్స్ తెలుగు చెప్పట్లేదు. మీరు మరింత సమాచారం కోసం.. సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.
సంబంధిత కథనం
టాపిక్