Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి శుభ ముహూర్తం, పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు, పరిహారాలు-today may 19th 2024 mohini ekadashi puja vidhanam ritulas chanting mantras and many more details in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mohini Ekadashi 2024: మోహినీ ఏకాదశి శుభ ముహూర్తం, పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు, పరిహారాలు

Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి శుభ ముహూర్తం, పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు, పరిహారాలు

Gunti Soundarya HT Telugu
May 19, 2024 06:00 AM IST

Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి మే 19వ తేదీ జరుపుకుంటున్నారు. ఈ ఏకాదశి పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు, చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.

మోహినీ ఏకాదశి పూజా విధానం
మోహినీ ఏకాదశి పూజా విధానం

Mohini ekadashi 2024: వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. మే 19వ తేదీ ఆదివారం మోహినీ ఏకాదశి జరుపుకుంటున్నాము. ఈ ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది.

ఈ ఏడాది మోహినీ ఏకాదశి అనేక శుభకార్యాలతో వచ్చింది. ఈరోజు సర్వార్ధ సిద్ధియోగం, లక్ష్మీనారాయణ యోగం, శుక్రాదిత్య యోగం ఉన్నాయి. ఈరోజు భక్తిశ్రద్దలతో పూజ చేయడం వల్ల భక్తులకు విష్ణు అనుగ్రహం లభిస్తుంది. పురాణాల ప్రకారం మోహినీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల జాతకుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఏకాదశి పూజ విధానం, పరిహారాలు, ప్రాముఖ్యత, మంత్రాలు, ఉపవాస పారాయణం గురించి తెలుసుకుందాం.

పూజా విధి

మోహినీ ఏకాదశి నాడు పొద్దున్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంటి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. విష్ణుమూర్తికి పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేయాలి. తర్వాత స్వామికి చందనం, పసుపు పువ్వులు సమర్పించాలి. అనంతరం దీపం వెలిగించాలి. వీలైతే ఉపవాసం ఉండాలి. ఈరోజు తప్పనిసరిగా మోహినీ ఏకాదశి వ్రత కథ చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. పూజ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. విష్ణువు, లక్ష్మీదేవికి తులసితో భోగం సమర్పించాలి. అయితే ఏకాదశి రోజు తులసి ఆకులు తెంపకూడదు కనుక ముందు రోజే కోసి పెట్టుకోవాలి.

జపించాల్సిన మంత్రాలు

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

ఓం విష్ణువే నమః

మోహన్ ఏకాదశి ప్రాముఖ్యత

క్షీరసాగర మథనం సమయంలో విష్ణువు మోహిని రూపాన్ని ధరించి అసురులకు అమృతం దక్కకుండా చేసి దేవతలకు అందజేస్తాడు. అందుకే ఈ ఏకాదశిని మోహినీ ఏకాదశిగా పిలుస్తారని పండితులు తెలిపారు. మోహినీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు నశిస్తాయి.

ఏకాదశి ముహూర్తం

మే 18 ఉదయం 11.22 గంటల నుండి మే 19వ తేదీ మధ్యాహ్నం 11.50 గంటల వరకు ఉంటుంది.

మోహినీ ఏకాదశి పరిహారాలు

ఈ రోజున స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తి మోహినీ రూపానికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. విష్ణు సహస్రనామం స్తోత్రం పఠించాలి. తులసి ఆకులు, పండ్లు, పువ్వులు, పసుపు వస్త్రాలు, కుంకుమ పాలు మొదలైన స్వామికి సమర్పించాలి. ఏకాదశి ఉపవాసం ఆచరిస్తున్న వాళ్ళు మరుసటి రోజు బ్రాహ్మణులకు ఆహారం పెట్టి వస్త్ర దానం చేసిన తర్వాత ఉపవాస దీక్ష విరమించాలి. ఇలా చేయడం వల్ల మాయ తొలగిపోయి మోక్షం లభిస్తుంది.

వ్యాపారంలో మంచి లాభాలు పొందడం కోసం ఈరోజు బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి అన్నదానం, వస్త్రదానం చేయాలి. అలాగే మీ సామర్థ్యాన్ని బట్టి కొంత దక్షిణ కూడా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలు పొందుతారు. మోహినీ ఏకాదశి రోజు పసుపు వస్త్రాలు ధరించడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. 

ఈ పనులు చేయొద్దు

మోహినీ ఏకాదశి రోజు బియ్యం, పప్పు ధాన్యాలు వంటివి పొరపాటున కూడా స్వీకరించకూడదు. ఈరోజు ధాన్యాలలో సకల పాపాలు నిమగ్నమై ఉంటాయని చెబుతారు. అందుకే వాటిని తీసుకోవడం వల్ల శరీరంలోకి పాపాలు ప్రవేశిస్తాయి.

మాంసాహారం, ఆల్కహాల్, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలు తీసుకోకూడదు. అలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. ఎవరినీ హింసకు గురి చేయరాదు.

 

Whats_app_banner