Sun saturn conjunction: శని సూర్యుల కలయిక.. ఈ నెల రోజులు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..-sun saturn conjunction in kumbha rashi these zodiac signs get financial benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Saturn Conjunction: శని సూర్యుల కలయిక.. ఈ నెల రోజులు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Sun saturn conjunction: శని సూర్యుల కలయిక.. ఈ నెల రోజులు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Gunti Soundarya HT Telugu
Feb 13, 2024 10:59 AM IST

Sun saturn conjunction: కుంభ రాశిలో శని, సూర్య గ్రహాలు దాదాపు 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాయి. దీని ఫలితం మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.

శని సూర్య సంయోగం
శని సూర్య సంయోగం (pixabay)

Sun saturn conjunction: గ్రహాల రాజు సూర్యుడు తన రాశిని మార్చుకున్నాడు. ఫిబ్రవరి 13న సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశి ప్రవేశం చేశాడు. శని సొంత రాశి అయిన కుంభ రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతుంది. 2024 మార్చి 15 వరకు సూర్య, శని గ్రహల కలయిక ఉంటుంది.

దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని, సూర్యుడు కలుసుకున్నారు. ఈ రెండింటి మధ్య తండ్రీ కొడుకుల సంబంధం ఉంది. కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు, శని గ్రహాలు శత్రు గ్రహాలు. సూర్యుడు నెల రోజుల పాటు ఇదే రాశిలో సంచరిస్తాడు. ఇక శని ఫిబ్రవరి 11న అస్తంగత్వం చెందబోతుంది. మళ్ళీ మార్చి 17న శని కుంభ రాశిలో ఉదయిస్తుంది.

గ్రహాల కలయికకి జ్యోతిష్య శాస్త్రంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. వసంత పంచమికి ఒక రోజు ముందు శని సూర్య గ్రహాల కలయిక మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపుతుంది. జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉంటే వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని రాశుల వారికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. వృత్తి పరంగాను పురోగతి ఉంటుంది. ఇక విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. ఈ సమయం వ్యాపారస్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈ రెండు గ్రహాల కలయిక ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం.

మేష రాశి

శని సూర్య సంయోగం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనువైన సమయం. ఆర్థిక రంగంలో పురోభివృద్ధి ఉంటుంది.

వృషభ రాశి

ఈ సంయోగం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు చేస్తారు. స్థిర, చరాస్తులు క్రయవిక్రయాలు జరుగుతాయి.

మిథునం

శని, సూర్యుల కలయిక మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన పనులు అదనపు శ్రమతో పూర్తి చేస్తారు. కొన్ని కొత్త బాధ్యతలు మీమీద పడతాయి.

కర్కాటకం

ఈ రెండు గ్రహాల కలయిక కర్కాటక రాశి వారి అశుభ ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారు తీసుకునే ఒక నిర్ణయం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

సింహం

భాగస్వామ్య, కుటుంబ జీవితంలో స్వల్ప ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. నూతన పనుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

కన్య రాశి

ఈ రాశి వారికి శని, సూర్య కలయిక మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మరమ్మత్తులకు ఖర్చు చేస్తారు. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.

తులా రాశి

వ్యాపార సంబంధమైన వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

వృశ్చికం

పని ప్రదేశంలో మార్పులు వస్తాయి. మీ పని పట్ల ఇతరులు సంతృప్తి చెందుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

ధనుస్సు రాశి

కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. గౌరవం, హోదా లభిస్తుంది. అదృష్టం మీకు మద్ధతుగా ఉంటుంది.

మకర రాశి

ఇతరులతో మీ సంబంధాలు కొద్దిగా సమస్యలు కలిగిస్తుంది. ఆకస్మికంగా అధిక ఖర్చులు ఉంటాయి. ఆవేశంతో తీసుకునే కొన్ని నిర్ణయాలు హాని కలిగిస్తాయి.

కుంభం

ఈ రాశిలోనే శని, సూర్య సంయోగం ఉండనుంది. ఫలితంగా కుంభ రాశి వారికి శుభం చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త బంధాలు ఏర్పడతాయి.

మీనం

ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ప్రత్యర్థుల నుంచి సమస్యలు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

WhatsApp channel