శ్రీ శని అష్టోత్తర శతనామావళి పారాయణం.. కష్టాల నుంచి విముక్తికి మార్గం-sri shani ashtottara shatanamavali telugu recitation path for removal of obstacles sufferings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రీ శని అష్టోత్తర శతనామావళి పారాయణం.. కష్టాల నుంచి విముక్తికి మార్గం

శ్రీ శని అష్టోత్తర శతనామావళి పారాయణం.. కష్టాల నుంచి విముక్తికి మార్గం

HT Telugu Desk HT Telugu
Jun 10, 2023 03:45 AM IST

శని అష్టోత్తర శతనామావళి ఇక్కడ చదవొచ్చు. కష్టాల సుడిగండంలో ఉన్నారంటే మీకు శని అనుగ్రహం కరువైనట్టు గ్రహించాలి. శని చల్లని చూపు కోసం ప్రతి శనివారం ఈ శని అష్టోత్తర శతనామావళి చదవండి.

శని అష్టోత్తర శతనామావళి పారాయణం కష్టాల నుంచి విముక్తికి మార్గం
శని అష్టోత్తర శతనామావళి పారాయణం కష్టాల నుంచి విముక్తికి మార్గం

శని దశ ప్రారంభ సమయం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిన నాటి శని కాలంలో అష్టకష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఈ సమయంలో శివయ్యను ప్రార్థించాలి. శనీశ్వరుడిని ఆరాధించాలి. తిరునల్లారు, శని సింగనాపురం వంటి శని క్షేత్రాలను సందర్శించాలి. తరచుగా నువ్వులు, మినుములు, నూనె, ఇనుము, నల్లని వస్త్రాలు దానం చేయాలి. ప్రతి శనివారం శని అష్టోత్తర శతనామావళి, శని స్తోత్రం పారాయణం చేయాలి.

శని అష్టోత్తర శతనామావళి

 1. ఓం శనైశ్చరాయ నమః
 2. ఓం శరణ్యాయ నమః
 3. ఓం సౌమ్యాయ నమః
 4. ఓం శాంతాయ నమః
 5. ఓం సర్వాభీష్టప్రదాయినే నమః
 6. ఓం వరేణ్యాయ నమః
 7. ఓం సర్వేశాయ నమః
 8. ఓం సురవంద్యాయ నమః
 9. ఓం సురలోకవిహారిణే నమః
 10. ఓం సుఖాసనోపవిష్టాయ నమః
 11. ఓం సుందరాయ నమః
 12. ఓం ఘనాయ నమః
 13. ఓం ఘనరూపాయ నమః
 14. ఓం ఘనాభరణధారిణే నమః
 15. ఓం ఘనసారవిలేపాయ నమః
 16. ఓం ఖద్యోతాయ నమః
 17. ఓం మందాయ నమః
 18. ఓం మందచేష్టాయ నమః
 19. ఓం మహనీయగుణాత్మనే నమః
 20. మర్త్యపావనపాదాయ నమః
 21. ఓం మహేశాయ నమః
 22. ఓం ఛాయాపుత్రాయ నమః
 23. ఓం శర్వాయ నమః
 24. ఓం శరతూణీరధారిణే నమః
 25. ఓం చరస్థిరస్వభావాయ నమః
 26. ఓం చంచలాయ నమః
 27. ఓం నీలవరాయ నమః
 28. ఓం నిత్యాయ నమః
 29. ఓం నీలాంజననిభాయ నమః
 30. ఓం నీలాంబరవిభూషణాయ నమః
 31. ఓం నిశ్చలాయ నమః
 32. ఓం వేద్యాయ నమః
 33. ఓం విధిరూపాయ నమః
 34. ఓం విరోధాధారభూమయే నమః
 35. ఓం వేదాస్పదస్వభావాయ నమః
 36. ఓం వజ్రదేహాయ నమః
 37. ఓం వైరాగ్యదాయ నమః
 38. ఓం వీరాయ నమః
 39. ఓం వీతరోగభయాయ నమః
 40. ఓం విపత్పరంపరేశాయ నమః
 41. ఓం విశ్వవంద్యాయ నమః
 42. ఓం గృధ్రవాహాయ నమః
 43. ఓం గూఢాయ నమః
 44. ఓం కూర్మాంగాయ నమః
 45. ఓం కురూపిణే నమః
 46. ఓం కుత్సితాయ నమః
 47. ఓం గుణాఢ్యాయ నమః
 48. ఓం గోచరాయ నమః
 49. ఓం అవిద్యామూలనాశాయ నమః
 50. ఓం విద్యా విద్యాస్వరూపిణే నమః
 51. ఓం ఆయుష్యకారణాయ నమః
 52. ఓం ఆపదుద్ధర్తే నమః
 53. ఓం విష్ణుభక్తాయ నమః
 54. ఓం వశినే నమః
 55. ఓం వివిధాగమవేదినే నమః
 56. ఓం విధిస్తుత్యాయ నమః
 57. ఓం వంద్యాయ నమః
 58. ఓం విరూపాక్షాయ నమ:
 59. ఓం పరిషాయ నమః
 60. ఓం గరిష్ఠాయ నమః
 61. ఓం వజ్రాంకుశధరాయ నమః
 62. ఓం వరదాయ నమః
 63. ఓం అభయహస్తాయ నమః
 64. ఓం వామనాయ నమః
 65. ఓం జ్యేష్టాపత్నీసమేతాయ నమః
 66. ఓం శ్రేష్టాయ నమః
 67. ఓం అమితభాషిణే నమః
 68. ఓం కష్టాఘనాశకాయ నమః
 69. ఓం ఆర్యపుష్టిదాయ నమః
 70. ఓం స్తుత్యాయ నమః
 71. ఓం స్తోత్రగమ్యాయ నమః
 72. ఓం భక్తివశ్యాయ నమః
 73. ఓం భానవే నమః
 74. ఓం భానుపుత్రాయ నమః
 75. ఓం భవ్యాయ నమః
 76. ఓం పావనాయ నమః
 77. ఓం ధనుర్మండలసంస్థాయ నమః
 78. ఓం ధనదాయ నమః
 79. ఓం ధనుష్మతే నమః
 80. ఓం తనుప్రకాశదేహాయ నమః
 81. ఓం తామసాయ నమః
 82. ఓం అశేషజనవంద్యాయ నమః
 83. ఓం విశేషఫలదాయినే నమః
 84. ఓం వశీకృతజనేశాయ నమః
 85. ఓం పశూనాంపతయే నమః
 86. ఓం భేచరాయ నమః
 87. ఓం ఖగేశాయ నమః
 88. ఓం ఘననీలాంబరాయ నమః
 89. ఓం కాఠిన్యమానసాయ నమః
 90. ఓం ఆర్యగణస్తుత్యాయ నమః
 91. ఓం నీలచ్ఛత్రాయ నమః
 92. ఓం నిత్యాయ నమః
 93. ఓం నిర్గుణాయ నమః
 94. ఓం గుణాత్మనే నమః
 95. ఓం నిరామయాయ నమః
 96. ఓం నింద్యాయ నమః
 97. ఓం వందనీయాయ నమః
 98. ఓం ధీరాయ నమః
 99. ఓం దివ్యదేవాయ నమః
 100. దీనార్తిహరణాయ నమః
 101. ఓం దైన్యనాశకరాయ నమః
 102. ఆర్యజనగణ్యాయ నమః
 103. ఓం క్రూరాయ నమః
 104. ఓం క్రూరచేష్టాయ నమః
 105. ఓం కామక్రోధకరాయ నమః
 106. ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః
 107. ఓం పరిపోషితభక్తాయ నమః
 108. ఓం పరభీతిహరాయ నమః
 109. ఓం భక్తసంఘమనోభీష్టఫలదాయ నమః
 110. ఓం శ్రీమచ్చనైశ్చరాయ నమః

శని అష్టోత్తర శతనామావళి సమాప్తం.

WhatsApp channel