వారం రోజుల్లో కుంభంలో శని వక్రగమనం.. ఈ రాశులపై ప్రభావం
వారం రోజుల్లో కుంభంలో శని వక్రగమనం వల్ల పలు రాశులపై సానుకూల, ప్రతికూల ప్రభావం ఉంటుంది.
శని గ్రహం ఒక నిర్ధిష్ట రాశిలో తన ప్రయాణం పూర్తిచేయడానికి రెండున్నరేళ్లు పడుతుంది. ఈ కారణంగా అన్ని రాశుల్లో తన ప్రయాణం పూర్తిచేయాలంటే 30 ఏళ్లు పడుతుంది. జనవరి 17, 2023న శని కుంభంలోకి ప్రవేశించింది. ఇప్పుడు జూన్ 17, 2023 రాత్రి 10.48 నుంచి కుంభంలో తిరోగమనంలో పయనిస్తుంది. శని తిరోగమనంలో ఉన్నప్పుడు అన్ని రాశులపై గాఢమైన ప్రభావం చూపుతుంది. శని తిరోగమనం వల్ల ఏయే రాశులకు మేలు కలుగుతుందో ఇక్కడ తెలుసుకోండి. అలాగే ప్రతికూల ప్రభావాలూ తెలుసుకోండి.
మేష రాశి
మేష రాశి వారికి శని పదవ ఇంటికి, పదకొంటో ఇంటికి అధిపతి. 11వ స్థానంలో తిరోగమనంగా మారుతుంది. కుంభంలో శని తిరోగమనం మేష రాశి జాతకుల వృత్తి, లాభాలను ప్రభావితం చేస్తుంది. అనుకున్న ఫలితాన్ని పొందడానికి మీరు మీ పనిలో అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. మీకు చివరకు మెరుగైన ఆర్థిక అవకాశాలు లభిస్తాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి శని ఎనిమిదో, తొమ్మిదో ఇంటికి అధిపతి. మిథున రాశి వారికి ఈ తిరోగమనం వల్ల మీ అదృష్టం కొంత నెమ్మదిస్తుంది. మీ పనులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుంది. కానీ పని పూర్తవుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి శని ఆరో, ఏడో ఇంటికి అధిపతి. ఏడో ఇంట్లో తిరోగమనం చెందుతాడు. వ్యాపారస్తులకు శుభవార్త. మీ వ్యాపారం ఊపందుకుని లాభాలు పొందుతారు. మీ పని ఏదైనా నిలిచిపోయినా, పెండింగ్‌లో ఉన్నా కచ్చితంగా పూర్తవుతుంది. వ్యాపారపరంగా లేదా సాధారణ ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.
కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు శని ఐదో, ఆరో ఇంటికి అధిపతి. ఆరో ఇంట్లో తిరోగమనం చెందుతారు. న్యాయవాదులకు ఇది శుభ సమయం కాదు. కేసులు తేలడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. మీ వద్దకు వచ్చే కోర్టు కేసుల సంఖ్య తగ్గిపోతుంది.
ధనుస్సు రాశి
కుంభ రాశిలో శని తిరోగమనంలో ఉండడం వల్ల సమీప భవిష్యత్తులో ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్టయితే మీకు కొత్త ఆఫర్లు లభిస్తాయి. మీ ప్రయత్నం, ధైర్యం పెరిగి విజయం సాధిస్తారు.