Saturn Transit: నవరాత్రుల్లో మొదటి రోజే శతాభిష నక్షత్రంలోకి శని.. ఏ రాశుల వారికి కలిసొస్తుందంటే?
Saturn Transit 2024: నవరాత్రుల మొదటి రోజునే శని తన నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు. దాంతో కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
Shani: గ్రహాలకు అధిపతి శని. ఆ శని ఎప్పటికప్పుడు తన రాశినే కాదు నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం కుంభ రాశిలో శని సంచరిస్తూ.. పూర్వ భాద్రపద నక్షత్రంలో ఉన్నాడు.
అక్టోబర్‌లో శని తన నక్షత్ర మండలాన్ని మార్చుకుంటాడు. శనిగ్రహం నక్షత్ర పరివర్తన అక్టోబర్ 3, 2024న (గురువారం) జరుగుతుంది. ఆ రోజు శతాభిష నక్షత్రంలోకి శని ప్రవేశిస్తాడు. అదే రోజు శారదీయ నవరాత్రులలో మొదటి రోజు.
నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి అమ్మవారిగా ప్రతిష్ఠించి పూజించే ఆచారం ఉంటుంది. నవరాత్రులలో శని నక్షత్రం మార్పు జ్యోతిష పరంగా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ ప్రారంభమై అక్టోబర్11వ తేదీ ముగుస్తాయి. మరుసటి రోజు అంటే అక్టోబరు 12న దసరా పండగ జరుపుకుంటారు.
శని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు లభిస్తాయి. పంచాంగం ప్రకారం శని అక్టోబర్ 3న మధ్యాహ్నం 12:10 గంటలకు శతాభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ నక్షత్రంలోనే ఈ ఏడాది డిసెంబరు 27 (శుక్రవారం) రాత్రి 10:42 గంటల వరకు ఉంటాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతాభిష నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ రాహువు నీడ గ్రహం మాత్రమే కాదు చెడు చేసే గ్రహం కూడా. అటువంటి రాహువు నక్షత్రంలో శని సంచరిస్తాడు.
శని శతాభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేషం, మిథునం, సింహం, కన్య, తులా, మకర, కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్యుడు పండిట్ దివాకర్ త్రిపాఠి తెలిపారు.
వచ్చే ఏడాది మీన రాశిలోకి శని ప్రవేశిస్తాడు. మీన రాశికి అధిపతి బృహస్పతి. ఏలినాటి శని దాదాపు ఏడన్నరేళ్లు ఉంటుంది. కాబట్టి మీన రాశి వారికి 2030లో విముక్తి లభించనుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.