Numerology: ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు శని ఆశీస్సులు ఉంటాయి.. డబ్బు కొదువ ఉండదు-numerology predictions shani dev blessings to these date of birth people ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Numerology: ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు శని ఆశీస్సులు ఉంటాయి.. డబ్బు కొదువ ఉండదు

Numerology: ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు శని ఆశీస్సులు ఉంటాయి.. డబ్బు కొదువ ఉండదు

Gunti Soundarya HT Telugu
Feb 18, 2024 10:00 AM IST

Numerology: న్యూమరాలజీ ప్రకారం ఎనిమిది సంఖ్య కలిగిన వారికి శనీశ్వరుడు ఆశీస్సులు ఉంటాయి. మీరు ఈ పుట్టిన తేదీ వాళ్ళా? అయితే మీకు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

న్యూమరాలజీ
న్యూమరాలజీ (freepik)

Numerology: జ్యోతిష్య శాస్త్రంలో రాశులకు ప్రాధాన్యం ఉన్నట్టే సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలకు ప్రాముఖ్యత ఉంటుంది. రాశుల మాదిరిగానే రాడిక్స్ కూడా ఏడో ఒక గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ప్రకారం సంఖ్యాశాస్త్రం చూసి అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అంచనా వేస్తారు.

న్యూమరాలజీ ప్రకారం ఓ వ్యక్తి పుట్టిన తేదీని కూడిన తర్వాత వచ్చే అంకెని రాడిక్స్ అంటారు. అలాగే మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కూడినప్పుడు వచ్చే సంఖ్యని ఫేట్ నెంబర్ అని పిలుస్తారు. 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులకు వారి రాడిక్స్ నెంబర్ 8. అంటే 1+7=8, 2+6=8. న్యూమరాలజీ ప్రకారం సంఖ్య అధిపతిగా శని దేవుడిని భావిస్తారు. రాడిక్స్ 8 ఉన్న వారి పట్ల శని దేవుడు దయ చూపిస్తాడని చెప్తారు. రాడిక్స్ నెంబర్ 8 లేదా 8, 17, 26 తేదీల్లో పుట్టిన రాశుల వారు కష్టపడిన దానికి ప్రతిఫలం అందుకుంటారు. విజయం వరిస్తుంది. శని దేవుడి ఆశీస్సులు ఉంటాయి. జీవితంలో ఏ సమయంలోనైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరికి విజయం మాత్రం వీరినే వరిస్తుంది.

రాడిక్స్ 8 ఉన్న వ్యక్తుల లక్షణాలు

8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి 8 సంఖ్య ఉంటుంది. ఈ రాడిక్స్ ఉన్న వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ తేదీలలో జన్మించిన వాళ్ళు శ్రమ కలిగింది కదాని వెనుకడుగు వేయరు. ఇతరులతో తమ భావాన్ని పంచుకోవడానికి సంకోచిస్తారు. ఎంత కష్టమైన పని అయినా సరే విజయం సాధించే వరకు వదిలిపెట్టరు. దీని వల్ల వాళ్ళు జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ శని ఆశీస్సులతో అంతా మంచే జరుగుతుంది.

పుట్టిన తేదీ 8 అయితే..

ఏ నెలలోనైనా 8వ తేదీలో జన్మించిన వారిలో ఆత్మవిశ్వాసం లోపించదు. ఈ తేదీలో జన్మించిన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సవాళ్ళకు భయపడరు. విజయం వరించే దాకా వదిలిపెట్టరు. అందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఏ పనిని అసంపూర్తిగా వదిలిపెట్టరు. ఇతరుల నమ్మకం గెలుచుకోవడంలో నిష్ణాతులు. కానీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోలేరు. ఫలితంగా కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పుట్టిన తేదీ 17 అయితే..

ఏ నెలలో అయినా 17వ తేదీ జన్మించిన వారికి కూడా రాడిక్స్ నెంబర్ 8 గా ఉంటుంది. పుట్టిన తేదీ 17 ఉన్నవారికి శని దేవుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఆలోచనల్లో వీరికి ఎవరూ పోటీ ఉండరు. పనిలో వేగం కాస్త మందకొడిగా ఉన్నా పనుల్లో బాధ్యత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నెంబర్ ఉన్న వారికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.

పుట్టిన తేదీ 26 అయితే..

26 వ తేదీన జన్మించిన వారికి ఓపిక తక్కువగా ఉంటుంది. దీని వల్ల జీవితంలో చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తేదీన పుట్టిన వాళ్ళు డబ్బు పరంగా చాలా అదృష్టవంతులు. చాలా ఆలోచించి డబ్బులు ఖర్చు చేస్తారు. మేనేజ్ మెంట్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఈ తేదీలో జన్మించి వ్యక్తులు ఎప్పుడు డబ్బు లేని పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉండదు.

WhatsApp channel