భవిష్యత్ నిర్ణయించే న్యూమరాలజీ.. ఫ్యూచర్‌ను ఎలా నిర్ణయిస్తారంటే!-and how to calculate your life path and destiny numbers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  భవిష్యత్ నిర్ణయించే న్యూమరాలజీ.. ఫ్యూచర్‌ను ఎలా నిర్ణయిస్తారంటే!

భవిష్యత్ నిర్ణయించే న్యూమరాలజీ.. ఫ్యూచర్‌ను ఎలా నిర్ణయిస్తారంటే!

HT Telugu Desk HT Telugu
Published May 19, 2022 11:02 PM IST

న్యూమరాలజీలో రాడిక్స్ అధారంగా వ్యక్తి భవిష్యత్ నిర్ణయిస్తారు. రాడిక్స్ అంటే ఆ వ్యక్తి ఫుట్టిన తేదీ మొత్తం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏప్రిల్ 23న జన్మించినట్లయితే, అతని పుట్టిన తేదీలోని అంకెల మొత్తం 2+3=5 అవుతుంది. అంటే, 5ని ఆ వ్యక్తి రాడిక్స్ అంటారు.

<p>numerology</p>
numerology

జ్యోతిష్యంలా, న్యూమరాలజీ కూడా వ్యక్తి భవిష్యత్, స్వభావం, వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తోంది. ప్రతి పేరును బట్టి ఒక రాశి ఉన్నట్లే, అదే విధంగా, ప్రతి సంఖ్య ప్రకారంగా, సంఖ్యాశాస్త్రంలో వ్యక్తుల భవిష్యత్‌ నిర్ణయించబడుతుంది. న్యూమరాలజీ ప్రకారంగా మీరు మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అధారంగా మీ సంఖ్యను లెక్కిస్తారు. సంఖ్యాశాస్త్రంలో రాడిక్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. రాడిక్స్ వ్యక్తి భవిష్యత్ నిర్ణయిస్తుంది. రాడిక్స్ అంటే ఆ వ్యక్తి ఫుట్టిన తేదీ మొత్తం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏప్రిల్ 23న జన్మించినట్లయితే, అతని పుట్టిన తేదీలోని అంకెల మొత్తం 2+3=5 అవుతుంది. అంటే, 5ని ఆ వ్యక్తి రాడిక్స్ అంటారు.

ఇలా ఎవరిదైనా పుట్టిన తేదీ రెండు అంకెలు అంటే 11 అయితే, అతని రాడిక్స్ 1+1=2 అవుతుంది. పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం మొత్తాన్ని భాగ్యాంక్ అంటారు. ఉదాహరణకు, ఎవరైనా 22-04-1996న జన్మించినట్లయితే, ఈ మొత్తం సంఖ్యల మొత్తాన్ని భాగ్యంక్ అంటారు. 2+2+0+4+1+9+9+6=33=6 అంటే అతని అదృష్ట సంఖ్య 6. ఈ అంకెల అధారంగా న్యూమరాలజీని లెక్కిస్తారు. అది పాజీటివ్‌గా ఉంటే రోజువారీ ప్రణాళికలను విజయవంతం చేయగలుగుతారు. రోజువారీ న్యూమరాలజీ ప్రకారం, మీ రాడిక్స్ ఆధారంగా మీ నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలియజేస్తుంది. ఈరోజు మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవచ్చు లేదా ఎలాంటి అవకాశాలను పొందవచ్చు. రోజువారీ న్యూమరాలజీ అంచనాలను వేయడం ద్వారా, జరగబోయే పరిస్థితులకు సిద్ధంగా ఉండవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం