Numerology 2023 : మీ పుట్టిన తేదీ ఇదేనా? అయితే మీరు తెలివైనవారే-numerology 2023 people with these birth dates are considered intelligent and talented know about yours ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Numerology 2023 : మీ పుట్టిన తేదీ ఇదేనా? అయితే మీరు తెలివైనవారే

Numerology 2023 : మీ పుట్టిన తేదీ ఇదేనా? అయితే మీరు తెలివైనవారే

HT Telugu Desk HT Telugu
Feb 06, 2023 10:13 AM IST

Numerology 2023 : న్యూమరాలజీని కొంతమంది బాగా నమ్ముతారు. అయితే పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైనవారిగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ప్రతిభావంతులుగా పరిగణిస్తారు. హార్డ్ వర్క్ ఆధారంగా తమ అదృష్టాన్ని సంపాదించుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా స్పెషల్(Special). ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు 8 సంఖ్యను కలిగి ఉంటారు. అంటే 1 ప్లస్ 7.. ఎనిమిది అన్నమాట. 2 ప్లస్ 6... ఇలా చూసుకుంటారు. అయితే ఈ సంఖ్య ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు.

ఎనిమిది సంఖ్య(Eight Number) కలిగి ఉండే వ్యక్తులు.. అదృష్టం కంటే కర్మను ఎక్కువగా నమ్ముతారట. వారి జీవితంలో విజయాన్ని పొందుతారు. ఈ పుట్టిన తేదీలను(Birthday Dates) కలిగి ఉన్న వ్యక్తులు తెలివైనవారు, ప్రతిభావంతులుగా పరిగణిస్తారని పండితులు చెబుతున్నారు. వారు తమ కష్టార్జితం ఆధారంగా తమ అదృష్టాన్ని సంపాదించుకుంటారు. సంఖ్యాశాస్త్రంలో 1 నుండి 9 వరకు సంఖ్యలు పేర్కొంటారు. ఈ సంఖ్యలు, గ్రహాలకు సంబంధం ఉంటుందని చెబుతారు. ఎనిమిది సంఖ్య శని దేవ్‌కి సంబంధించినదట. శని దేవుడి ప్రభావం వల్ల ఈ వ్యక్తులు తెలివైనవారు, ప్రతిభావంతులు అవుతారు. అలాగే, ఈ వ్యక్తులు గమ్యాన్ని స్వంతంగా సాధిస్తారు. న్యూమరాలజీ(Numerology) ప్రకారం, నెలలో 8, 17 లేదా 26 తేదీలలో జన్మించిన వారికి 8 సంఖ్య ఉంటుంది.

ఈ సంఖ్య ఉన్న వ్యక్తులు తెలివైనవారు, ప్రతిభావంతులు. ఈ వ్యక్తులు జీవితంలో చాలా అరుదుగా ఏదైనా విషయాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడతారు. అలాగే రహస్యంగా ఉంటారు. ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు. వారు భౌతికవాదానికి కొంచెం దూరంగా ఉంటారు. అదే సమయంలో అదృష్టం కంటే కర్మను ఎక్కువగా నమ్ముతారు. ఈ వ్యక్తులు కూడా సమయపాలన పాటించేవారు. అలాగే పనికి ఆలస్యంగా రావడం కూడా వారికి ఇష్టం ఉండదు. ఆఫీసు(Office)లో కష్టపడి పనిచేయడం ద్వారా తమకంటూ ఒక పేరు సంపాదిస్తారు. ఈ వ్యక్తులు రహస్య విషయాల గురించి కూడా అవగాహన కలిగి ఉంటారు. అంటే వారికి జ్యోతిష్యం, తాత్విక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది.

ఈ ఎనిమిది సంఖ్య కలిగి ఉండే.. వారు డబ్బు(Money) ఆదా చేయడంలో నిపుణులు. డబ్బును చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. దీనితో పాటు ఈ వ్యక్తులు పొదుపు చేయడంలో కూడా నిపుణులు. అదే శనిదేవుడు వారికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని ఇస్తాడని చెబుతారు. అంటే ఈ వ్యక్తులు టీమ్ ను కూడా బాగా నడిపిస్తారు. ఈ వ్యక్తులు లక్ష్యం కోసం వెళితే, అది సాధించిన తర్వాత తిరిగి వస్తారని న్యూమరాలజీ చెబుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం