Mercury transit: వృశ్చిక రాశిలో బుధ సంచారం- ధన త్రయోదశి నుంచి వీరికి ఆరోగ్య సమస్యలు, అధిక ఖర్చులు
Mercury transit: ధన త్రయోదశి నుంచి బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధిక ఖర్చులు ఉంటాయి. ఏయే రాశుల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఇది. వివేకం, తెలివితేటలు, వాక్కు మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం బుధుడు తులా రాశిలో సంచరిస్తున్నాడు.
ధన త్రయోదశి అక్టోబర్ 29 నుంచి బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తారు. ఈ రాశికి అంగారకుడు అధిపతి. బుధ, కుజ గ్రహాల మధ్య శత్రుత్వ స్వభావం ఉంటుందని అంటారు. అందువల్ల వృశ్చిక రాశిలో బుధుడి స్థానం ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. కొన్ని రాశుల వారికి దుఃఖం, పతనానికి కారణం అవుతుంది. ఇది కొన్ని క్లిష్టమైన పరిస్థితులను కల్పిస్తుంది. ఏయే రాశులకు బుధుడి సంచారం ఇబ్బందులు కలిగిస్తుందో చూద్దాం.
మేష రాశి
మేష రాశి ఎనిమిదవ ఇంట్లో బుధుడు సంచరించబోతున్నాడు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పరిస్థితి మరింత దిగజారవచ్చు. కమ్యూనికేషన నైపుణ్యాలు దెబ్బతింటాయి. మీ మాటలు సమస్యలకు దారి తీయవచ్చు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. చర్మ సమస్యలు, గొంతుకు సంబంధించిన వ్యాధులతో పోరాడాల్సి వస్తుంది. కొన్ని ఆకస్మిక సంఘటనల కారణంగా మానసిక అశాంతికి గురవుతారు.
మిథున రాశి
బుధుడు మిథున రాశి లగ్నాధిపతి, నాలుగో ఇంటిని పాలిస్తాడు. ఈ సమయంలో ఆరో స్థానంలో సంచరిస్తాడు. ఈ సంచారం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అనారోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ కలహాలు కూడా ఏర్పడతాయి. ఉద్యోగం, ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారులకు ఊహించని నష్టాలు, అధిక ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అందుకే ఏదైనా ముఖ్యమైన విషయంలో రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి పన్నెండవ ఇంట్లో బుధుడి సంచారం జరగబోతుంది. ఇది హాస్పిటల్, ఖర్చులు వంటి వాటికి ప్రతీకగా ఉంటాడు. పన్నెండవ ఇంట్లో బుధ సంచారం కెరీర్ అభివృద్ధికి అవకాశం కల్పిస్తుంది. కానీ అవి అందిపుచ్చుకోవడం కోసం అనేక అడ్డంకులు, ఎదురుదెబ్బలు తగులుతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ వాటికి మించి ఖర్చులు ఇబ్బంది పెడతాయి. గతంలో చేసిన పొదుపు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వైద్య సమస్యలు తీవ్రమవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోని శ్రద్ధ వహించాలి. లేదంటే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది.
బుధుడి నివారణలు
బుధ సంచారం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడేందుకు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. నపుంసకులను గౌరవించాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ విష్ణుమూర్తి ఆశీర్వాదాలు తీసుకోవాలి. పేదలకు కొన్ని ఆకు కూరలు పంచి పెట్టండి. పక్షులకు ఆహారం అందించాలి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.