మిథున రాశిలోకి ర‌వి, బుధ, శుక్రుల మార్పు ప్ర‌భావం ఏ రాశుల‌కు క‌లిసి వస్తుంది?-mercury sun venus transit in mithuna rashi how will effect all zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మిథున రాశిలోకి ర‌వి, బుధ, శుక్రుల మార్పు ప్ర‌భావం ఏ రాశుల‌కు క‌లిసి వస్తుంది?

మిథున రాశిలోకి ర‌వి, బుధ, శుక్రుల మార్పు ప్ర‌భావం ఏ రాశుల‌కు క‌లిసి వస్తుంది?

HT Telugu Desk HT Telugu
Jun 20, 2024 10:42 AM IST

జూన్ 16 నుంచి మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు. దీని వల్ల మొత్తం పన్నెండు రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయిక
మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయిక (Pixabay)

జూన్ 16వ తేదీ నుంచి సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధ, శుక్రులు కూడా మిథున రాశిలో ర‌వితో క‌లిసి సంచ‌రించ‌డం చేత గురుడు వృష‌భ రాశి, శ‌ని కుంభ‌ రాశి సంచార ప్ర‌భావం వ‌ల్ల రాశుల వారిగా గ్ర‌హ‌స్థితుల్లో కొన్ని మార్పులు రానున్నాయ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు.

ర‌వి, బుధ‌, శుక్రులు మిథున రాశిలో సంచ‌రించ‌డం వ‌ల్ల మేష, సింహ‌, క‌న్య, తులా రాశుల వారికి బాగా క‌లిసి వ‌స్తుంద‌ని. వృష‌భ‌, వృశ్చిక‌, ధ‌నుస్సు, మ‌క‌ర‌, కుంభ రాశుల‌కు మ‌ధ్య‌స్థ ఫ‌లితాలు క‌లుగుతాయి. మిథున, క‌ర్కాట‌క, మీన రాశుల‌కు చెడు ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

మేష రాశి

ర‌వి, బుధ‌, శుక్రుల మార్పు వ‌ల‌న మేష రాశి వారికి జూన్‌, జులై మాసాలు క‌లిసి వ‌చ్చును. కుటుంబం, సోద‌ర‌, స‌హోద‌ర వ‌ర్గంతో ఆనందంగా గ‌డిపెద‌రు. అనుకున్న ప‌నులు పూర్తి చేసెద‌రు.

వృష‌భ రాశి

ప‌నుల యందు చికాకు, ధ‌న‌వ్య‌యం అధిక‌మ‌గును. ఒత్తిళ్లు ఏర్ప‌డే సూచ‌న‌.

మిథున రాశి

జ‌న్మ రాశిలో ర‌వి, బుధ‌, శుక్రుల సంచారం వ‌ల్ల మిథున రాశి వారికి జూన్‌, జులై మాసాల్లో ఉద్యోగ టెన్ష‌న్లు, వ్యాపార ఒత్తిళ్లు, ఆర్థిక స‌మ‌స్య‌లు ఇబ్బందిపెట్టును. ఆరోగ్య ప‌ర‌మైన విష‌యాల్లో జాగ్ర‌త్తలు వ‌హించ‌వ‌లెను.

క‌ర్కాట‌క రాశి

రవి, బుధ‌, శుక్రులు వ్య‌యస్థానంలో సంచ‌రించ‌డం వ‌ల్ల ప్ర‌యాణాలు, అధిక ఖ‌ర్చులు, ధ‌న వ్య‌య‌ము జ‌రుగును. ఖ‌ర్చులు నియంత్రించుకోవాల‌ని సూచ‌న‌.

సింహ‌ రాశి

సింహ‌ రాశి వారికి జూన్‌, జులైలో సూర్యుడు, బుధ, శుక్రుల అనుకూల‌త వ‌లన ధ‌న లాభం, సౌఖ్య‌ము, ఆనందం క‌లుగును. అనుకున్న ప‌నులు పూర్తి చేసెద‌రు. ఉద్యోగ‌స్తుల‌కు అనుకూలించును.

క‌న్యా రాశి

కన్యా రాశి వారికి ర‌వి, బుధ‌, శుక్రుల మార్పు అనుకూలించును. వ్యాపారాభివృద్ధి, ధ‌న‌లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందం క‌లుగును. అనుకున్న ప‌నులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసెద‌రు. అప్పుల బాధ తొల‌గును.

తులా రాశి

ర‌వి, బుధ‌, శుక్రుల మార్పు తులా రాశి వారికి క‌లిసి వ‌చ్చును. కుటుంబ‌సౌఖ్యం, ఆనందం పొందెద‌రు, పని ఒత్తిళ్లు ఉన్న‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించి విజ‌యాన్ని పొందెద‌రు.

వృశ్చిక రాశి

ర‌వి, బుధ‌, శుక్ర‌ల మార్పు వ‌ల్ల వృశ్చిక రాశికి మ‌ధ్య‌స్థం నుంచి చెడు ఫ‌లితాలు క‌లుగును. ఆరోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్టును. ప‌ని ఒత్తిళ్లు ఏర్ప‌డును. ఆరోగ్య విష‌యాల్లో క‌చ్చిత‌మైన జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

ధ‌నుస్సు రాశి

ధ‌నుస్సు రాశి వారికి ఈ గ్ర‌హాల మార్పు వ‌ల్ల మ‌థ్య‌స్థ ఫ‌లితాలు క‌లుగుతున్నాయి. కుటుంబంలో చికాకులు కొంత క‌ల‌చివేయును. ధ‌న‌లాభం క‌లుగును. స్త్రీ సౌఖ్యం, ఆనందం పొందెద‌రు.

మ‌క‌ర రాశి

ర‌వి, బుధ‌, శుక్రుల మార్పులు మ‌క‌ర రాశికి అనుకూలించును. ఆరోగ్యంలో మార్పులు వ‌చ్చును. ముఖ్యమైన ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసెద‌రు. న‌ర దిష్టి అధికంగా ఉండును.

కుంభ రాశి

ర‌వి, బుధ‌, శుక్రులు పంచ‌మంలో ఉండ‌టం చేత కుంభ రాశి వారి జీవితంలో మార్పులు వ‌చ్చును. శుభ ఫ‌లితాలు పొంద‌గ‌ల‌రు. ఉద్యోగ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృత‌మ‌గును. కృషికి త‌గ్గ ఫ‌లితం క‌లుగును.

మీన రాశి

ఆయా గ్ర‌హాల మార్పు వ‌ల్ల మీన రాశికి మ‌ధ్య‌స్థ ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. ప‌నుల‌లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ ముందుకు సాగెద‌రు. ఆర్థిక స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్టును. ఆరోగ్య విష‌యాలు, కుటుంబ వ్య‌వ‌హారాల‌లో జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సూచ‌న‌.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel