IRCTC Jyotirlinga Yatra : జ్యోతిర్లింగాల దర్శనం.. బడ్జెట్ ధరలో టూర్ ప్యాకేజీ-maha shivratri 2023 irctc announced jyotirlinga yatra tour package covers all jyotirlingas details here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Maha Shivratri 2023 Irctc Announced Jyotirlinga Yatra Tour Package Covers All Jyotirlingas Details Here

IRCTC Jyotirlinga Yatra : జ్యోతిర్లింగాల దర్శనం.. బడ్జెట్ ధరలో టూర్ ప్యాకేజీ

Anand Sai HT Telugu
Feb 12, 2023 10:14 AM IST

IRCTC Tour Package : మహా శివరాత్రి వస్తోంది. దేవదేవుడి పేరుతో ప్రధాన ఆలయాలు మారుమోగిపోనున్నాయి. అయితే జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

జ్యోతిర్లింగాల దర్శనం
జ్యోతిర్లింగాల దర్శనం (unsplash)

మహాశివరాత్రి అనేది శివ భక్తులకు ముఖ్యమైన రోజు. ఆ రోజున ఆలయాలకు వెళ్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడికి సంబంధించి.. ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. వాటిని దర్శించుకుంటే మంచిదని భక్తుల నమ్మకం. శివ జ్యోతిర్లింగాలు చాలా ఫేమస్. అత్యంత ప్రసిద్ధి చెందినవి. అక్కడకు వెళ్లడం అత్యంత పవిత్రమైనది శివ భక్తులు భావిస్తారు. అయితే వారికోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

IRCTC జ్యోతిర్లింగ యాత్ర టూర్ ప్యాకేజీలో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భేట్ ద్వారక, శివరాజ్‌పూర్ బీచ్ వంటి పుణ్యక్షేత్రాలు ఉంటాయి. శివుడు కాంతి స్వరూపంగా దర్శనమిచ్చాడని నమ్మే ఆలయాలు ఉన్నాయి.

1. సోమనాథ్ ఆలయం, 2. కాశీ విశ్వనాథ్, 3. మహాకాళేశ్వరుడు, 4. మల్లికార్జున, 5. ఓంకారేశ్వర్, 6. కేదార్ నాథ్, 7. భీమశంకర్, 8. బైద్యనాథ్, 9. రామనాథస్వామి, 10. నాగేశ్వరావు, 11. త్రయంబకేశ్వరుడు, 12. ఘృష్ణేశ్వర్

భారతీయ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) జ్యోతిర్లింగాలను సందర్శించాలనుకునే యాత్రికుల కోసం ప్రయాణ ప్యాకేజీని రూపొందించింది. ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భేట్ ద్వారక, శివరాజ్‌పూర్ బీచ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు IRCTC జ్యోతిర్లింగ యాత్ర టూర్ ప్యాకేజీలో ఉన్నాయి. దీని కోసం, IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ అధికారుల ద్వారా కూడా బుకింగ్‌లు చేయవచ్చు. IRCTC వెబ్‌సైట్‌లో రైలు బుకింగ్ అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు కూడా బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ అందుబాటులో ఉంది. 12 రాత్రులు, 13 రోజుల టూర్ ప్యాకేజి ఇది.

మహాశివరాత్రి నవ జ్యోతిర్లింగ యాత్ర SZBD384A

తేదీ: మార్చి 08, 2023 నుండి మార్చి 20, 2023 వరకు

ప్యాకేజీ కోడ్: SZBD384A

ప్యాకేజీ ధర : రూ. 15, 350

వివిధ స్టేషన్లకు రైలు వస్తుంది. రాక, బయలుదేరే సమయం తాత్కాలికంగా ఉంటుంది. రైల్వే అనుమతిపై ఆధారపడి ఉంటుంది. వివరాల సమాచారం irctcportal.inలో అందుబాటులో ఉంది. దగ్గరలోని కేంద్రాలను కూడా అడగొచ్చు.

WhatsApp channel