Kanya Rasi Today: కన్య రాశి వారి సలహాకి ఆఫీస్‌లో ప్రశంసలు, జాబ్ మారాలనుకుంటే ఈరోజు ట్రై చేయొచ్చు-kanya rasi phalalu today 27th august 2024 check your virgo zodiac sign horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kanya Rasi Today: కన్య రాశి వారి సలహాకి ఆఫీస్‌లో ప్రశంసలు, జాబ్ మారాలనుకుంటే ఈరోజు ట్రై చేయొచ్చు

Kanya Rasi Today: కన్య రాశి వారి సలహాకి ఆఫీస్‌లో ప్రశంసలు, జాబ్ మారాలనుకుంటే ఈరోజు ట్రై చేయొచ్చు

Galeti Rajendra HT Telugu
Aug 27, 2024 05:59 AM IST

Virgo Horoscope Today: రాశిచక్రంలో 6వ రాశి కన్య రాశి. పుట్టిన సమయంలో కన్యా రాశిలో చంద్రుడు సంచరిస్తున్న జాతకులను కన్యా రాశిగా పరిగణిస్తారు. ఈరోజు కన్య రాశి వారి కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక, ప్రేమ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

కన్య రాశి
కన్య రాశి

Kanya Rasi Phalalu 27th August 2024: కన్య రాశి వారు ఈరోజు వాదనలకు దూరంగా ఉండాలి. వృత్తి జీవితంలో ఎదుగుదలకు కొత్త అవకాశాలపై ఓ కన్నేసి ఉంచండి. ఈరోజు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సహాయం అందుతుంది. జీవనశైలిని మెరుగుపరుచుకోండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా,  ఫిట్ గా ఉంచుతుంది. 

ప్రేమ 

ఈ రోజు కన్య రాశి వారి ప్రేమ బంధంలో ఆసక్తికరమైన మలుపు ఉంది.  దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారు వారి సంబంధాలను మెరుగుపరుస్తారు. బ్రేకప్ పరిస్థితి మెరుగుపడుతుంది. అకస్మాత్తుగా ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. 

మీ భాగస్వామి ఎంపిక విషయంలో కాస్త సున్నితంగా ఉండండి. మీ లవర్‌ని స్పెషల్‌గా ఫీల్ అయ్యేలా చేయండి. మీ బాయ్ ఫ్రెండ్ పార్టనర్ కోసం ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ చేసుకోండి. వారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించండి. ఈరోజు కన్య రాశి స్త్రీలకు భాగస్వామి సహకారం లభిస్తుంది.

కెరీర్

కెరీర్‌లో కొత్త పనులకు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు ఆఫీసులో గంటల తరబడి పనిచేయాల్సి రావచ్చు. అవసరమైన పనులు జాగ్రత్తగా పూర్తిచేస్తారు. మీరు ఉద్యోగాలు మారాలనుకుంటే, ఈ రోజే మీ సీవీని అప్ డేట్ చేయండి. జాబ్ ఇంటర్వ్యూ కోసం కొంత సమాచారం సేకరించండి. 

ఈ రోజు మీ అభిప్రాయం, సలహాకి ప్రశంసలు దక్కుతాయి. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. టీమ్ మీటింగ్‌‌లో మీ ఆలోచనలను బహిరంగంగా పంచుకోండి.

ఆర్థిక 

ఈరోజు కన్య రాశి వారికి డబ్బు అనేక మార్గాల నుండి వస్తుంది. కానీ మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. కొంతమంది పెద్దలు డబ్బును పిల్లలకు పంచవచ్చు. కొంతమంది కన్య రాశి జాతకులు ఆస్తికి సంబంధించిన న్యాయ వివాదాలలో విజయం సాధిస్తారు. 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విదేశీ క్లయింట్ల నుంచి లబ్ది చేకూరుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఈ రోజు మీరు కొత్త వ్యాపారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటారు. పెట్టుబడులకు ఇది మంచి ఆప్షన్.

ఆరోగ్యం

ఈరోజు ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు కానీ గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్న వారు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బరువైన వస్తువులను ఎత్తవద్దు. డయాబెటిస్ పేషెంట్లు అవసరమైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అడ్వెంచర్ ట్రిప్ కు వెళ్ళేటప్పుడు మెడికల్ కిట్ తీసుకెళ్లండి.