Vastu tips: ఈ వస్తువుల స్థానాలు సరిగా ఉంచారంటే ఇంట్లోని బాధలు తొలగి సంతోషం వస్తుంది-follow these 5 vastu tips to get rid of domestic troubles happiness will come to the house ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: ఈ వస్తువుల స్థానాలు సరిగా ఉంచారంటే ఇంట్లోని బాధలు తొలగి సంతోషం వస్తుంది

Vastu tips: ఈ వస్తువుల స్థానాలు సరిగా ఉంచారంటే ఇంట్లోని బాధలు తొలగి సంతోషం వస్తుంది

Gunti Soundarya HT Telugu
Aug 16, 2024 10:00 AM IST

Vastu tips: ఇంట్లో ఉంచే కొన్ని వస్తువుల స్థానాలు సరిగా ఉండాలి. అప్పుడే ఇంటికి ఆనందం వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోయేందుకు, ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు కొన్ని వాస్తు నియమాలు అనుసరించి చూడండి. బాధలు లేకుండా ఇంట్లో సంతోషంగా జీవిస్తారు.

సంతోషాన్ని తీసుకొచ్చే వాస్తు చిట్కాలు
సంతోషాన్ని తీసుకొచ్చే వాస్తు చిట్కాలు

Vastu tips: వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని చిన్న పొరపాట్లు వాస్తు దోషాలను కలిగిస్తాయి. దీని వల్ల ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులు జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. విజయానికి అడ్డంకులు వస్తూ ఉంటాయి.

ఇది కాకుండా ఒక వ్యక్తి ఇంట్లో వస్తువులు సరైన స్థానంలో లేకపోవడం వల్ల కూడా ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. గృహ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి వాస్తులో అనేక ప్రత్యేక నివారణలు ఉన్నాయి. ఇంట్లో సానుకూలత, ఆనందాన్ని పెంచడానికి కొన్ని వాస్తు చిట్కాలు ప్రభావవంతంగా పని చేస్తాయి. వాస్తు ప్రకారం ఈ సాధారణ చర్యలు పాటించి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. 

వాస్తును సరిదిద్దండి

వాస్తు ప్రకారం ఇంటి ఆగ్నేయ మూల, నైరుతి మూల, వాయువ్య మూల, ఈశాన్య మూలల వాస్తు సరిగ్గా ఉండాలి. ఈ దిశలలో సరైన వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లు సర్దుకునేటప్పుడు ఈ దిశల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

ఇంటి రంగు

వాస్తు ప్రకారం ఇంటి ఆనందం, శాంతి కోసం ఇంటికి చాలా ముదురు రంగులు పొరపాటున కూడా వేయకూడదు. ఇంటి లోపల, వెలుపల తెలుపు, లేత గులాబీ రంగు పెయింట్ ఇంటికి వేయడం అదృష్టంగా పరిగణిస్తారు.

వంటగది వాస్తు

వంటగది ఇంటికి ఈశాన్య, తూర్పు, దక్షిణ దిశలో ఉండకూడదని నమ్ముతారు. ఈ దిశలో ఉంటే ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతాయని చెబుతారు. 

పడక గది వాస్తు

వాస్తు ప్రకారం నీటికి సంబంధించిన చిత్రాలను పడకగదిలో పెట్టకూడదు. దీంతో వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఇది కాకుండా బెడ్ రూమ్ అగ్ని కోణంలో ఉంటే అప్పుడు తూర్పు గోడపై ప్రశాంతమైన సముద్రం చిత్రాన్ని ఉంచవచ్చు.

డ్రాయింగ్ రూమ్ వాస్తు

ఇంటి ఆనందం, శ్రేయస్సు, సంతోషం కోసం డ్రాయింగ్ రూమ్‌లో కుటుంబ చిత్రాన్ని ఉంచండి. అందులో కుటుంబం మొత్తం నవ్వుతూ ఉన్నది పెట్టుకుంటే చాలా మంచిది. 

ఇంటికి ఆగ్నేయ దిశలో రాగి సూర్యుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచడడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ధన ప్రవాహం పెరిగి అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. 

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు మీ ముఖ్యమైన పత్రాలు, డబ్బు వంటివి ఆగ్నేయ దిశలో అసలు పెట్టకూడదు. వాటిని తూర్పు దిశలో ఉంచడం మంచిది. 

నెగటివ్ ఎనర్జీ తొలగించేందుకు 

వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించేందుకు ఒక చిన్న మట్టి కుండలో ఉప్పును నింపి తూర్పు దిశలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

బాత్ రూమ్ లో బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. నీటితో నింపి ఉంచాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి జీవితంలో ఆనందం కలుగుతుందని చెబుతారు. అలాగే కుళాయి నుంచి నీరు కారుతూ ఉండకూడదు. ఇది డబ్బు వృథాను సూచిస్తుంది. 

 

 

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner