Bathroom vastu tips: బాత్ రూమ్ లో ఉండే ఈ వస్తువులు వెంటనే తొలగించండి లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది-bathroom vastu tips remove these things today in your bathroom to remove bad luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bathroom Vastu Tips: బాత్ రూమ్ లో ఉండే ఈ వస్తువులు వెంటనే తొలగించండి లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది

Bathroom vastu tips: బాత్ రూమ్ లో ఉండే ఈ వస్తువులు వెంటనే తొలగించండి లేదంటే మీ జేబు ఖాళీ అవుతుంది

Gunti Soundarya HT Telugu
Jan 31, 2024 10:43 AM IST

Bathroom vastu tips: బాత్ రూమ్ కి సంబంధించి ఉండే కొన్ని చిన్న చిన్న విషయాలు తప్పుగా ఉండటం వల్ల అది కుటుంబ ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. అందుకే మీ బాత్ రూమ్ లో ఇవి ఉంటే వెంటనే వాటిని తొలగించేయండి.

బాత్ రూమ్ లో గుండ్రని అద్దం ఉందా?
బాత్ రూమ్ లో గుండ్రని అద్దం ఉందా? (pixabay)

Bathroom vastu tips: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి. అప్పుడే ఇంట్లో శ్రేయస్సు, శాంతి ఉంటాయి. ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తు ప్రకారమే సర్దుకుంటారు. కిచెన్ దగ్గర నుంచి విశ్రాంతి తీసుకునే బెడ్ రూమ్ వరకు వాస్తు పాటిస్తారు. కానీ బాత్ రూమ్ విషయంలో మాత్రం అంతగా పట్టించుకోరు. దీని వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా సమస్యలు ఎదురవుతాయి.

చాలా మంది తమ ఇళ్లలోని బాత్ రూమ్ లో గుండ్రటి ఆకారంలో ఉండే అద్దం పెట్టుకుంటారు. అలాగే నీరు ఎందుకు పట్టి పెట్టుకోవడమని బకెట్ ఖాళీగా ఉంచుతారు. కానీ అలా అసలు చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు పరాక్రమ ఇంటి బాత్ రూమ్ దిశ మాత్రమే కాదు అందులో పెట్టె వస్తువుల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే డబ్బు నష్టం, ఆరోగ్య సంబంధిత సమస్యలు కలిగిస్తాయి. స్నానాల గదికి సంబంధించి కూడా అనే వాస్తు నియమాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తేనే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది.

దిశ ముఖ్యం

ఇంటి లోపల బాత్ రూమ్ ఉత్తర లేదా వాయువ్య దిశలో నిర్మించాలి. వీటిని ఎప్పుడు దక్షిణ, ఆగ్నేయ లేదా నైరుతి దిశలో నిర్మించకూడదు. వాస్తు ప్రకారం వంట గది, బాత్ రూమ్ ఎప్పుడూ ఒకదాని కొకటి ఎదురుగా లేదా పక్క పక్కన ఉండకూడదు. అలాగే టాయిలెట్ సీటు కూడా పడమర లేదా వాయువ్య దిశలో ఉండాలి.

బకెట్ ఖాళీగా ఉంచకూడదు

చాలా మంది చేసే తప్పు ఇదే బకెట్ లో నీళ్ళు ఉంటే పాచి పడుతుందని అవసరమైనప్పుడు మాత్రమే నీళ్ళు పట్టుకుంటారు. మిగతా టైమ్ లో ఖాళీగా పెట్టేస్తారు. కానీ బాత్ రూమ్ లో ఎప్పుడు ఖాళీ బకెట్ ఉంచకూడదు. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఖాళీ బకెట్ చూడటం వల్ల జేబు కూడా ఖాళీ అయిపోతుంది. అందుకే కనీసం ఒక మగ్గు నీళ్ళు అయినా ఉంచాలి. అలాగే విరిగిన బకెట్ బాత్ రూమ్ లో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడదు. బాత్ రూమ్ లో బకెట్ లేదా టబ్ ఎప్పుడు నిండుగా ఉండాలి. ఒకవేళ నీరు పట్టడం ఇష్టం లేకపోతే బకెట్ ని తలకిందులుగా తిపపేయండి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది.

అద్దాలు పెడుతున్నారా?

ఈ మధ్య కాలంలో అన్ని ఇళ్ళలోను బాత్ రూమ్ లో చిన్న అద్దం అయినా ఉండే విధంగా చూసుకుంటున్నారు. అయితే అద్దం బాత్ రూమ్ ఉత్తర లేదా తూర్పు వైపు గోడ మీద ఉంచుకోవాలి. అలాగే వృత్తాకారంలో ఉండే అద్దం మాత్రం ఎప్పుడు పెట్టుకోకూడదు. చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలో మాత్రమే అద్దం ఉండాలి. వృత్తాకార, అండాకార అద్దాలు మంచివిగా పరిగణించబడవు. అలాగే వాస్తు ప్రకారం బయట రూమ్ డోర్ ముందు అద్దాలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరుతుంది.

తలుపులు తెరిచి పెడుతున్నారా?

బాత్ రూమ్ తడిగా ఉంటే ఆరిపోవడం కోసం కొంతమంది తలుపులు తెరిచి పెడతారు. లేదంటే మర్చిపోయి అలాగే తలుపు వేయకుండా వచ్చేస్తారు. కానీ బాత్ రూమ్ తలుపులు ఎప్పుడూ మూసే ఉంచాలి. తలుపులు తెరిచి ఉంచడం వాలల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. దీని వల్ల మీ కెరీర్ లో అనేక అడ్డంకులు ఎదురవుతాయి.

లీకేజ్ ట్యాప్ ఉండకూడదు

బాత్ రూమ్ లో లీకేజ్ అవుతున్న కుళాయి అసలు ఉండకూడదు. అలా ఉంటే మీ ఇంట్లో డబ్బు కూడా ఇలాగే వృధా అయిపోతుందని చెప్పేందుకు సంకేతం. అందుకే ఇంటి కుళాయి పైపు లీక్ వెంటనే సరి చేయించుకోవాలి. బాత్ రూమ్ లో ట్యాప్ లీకేజ్ వాస్తు దోషానికి కారణం అవుతుంది. ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

తడి బట్టలు ఉండకూడదు

బాత్ రూమ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొంతమంది స్నానం చేసిన తర్వాత హడావుడిగా ఉండటం వల్ల లేదంటే సోమరితనంతో తడి బట్టలు బాత్ రూమ్ లో వదిలి పెట్టేస్తారు. మురికి బట్టలు అలాగే బాత్ రూమ్ లో వదిలేస్తారు. మీరు చేసే ఈ పొరపాటు వాస్తు లోపంతో పాటు సూర్య దోషాన్ని కూడా కలిగిస్తుంది.

రంగు ముఖ్యమే

బాత్ రూమ్ లో వేసే రంగులు ఎంపిక సరిగా ఉండాలి. లేత రంగులు ఎంచుకోవాలి. స్విచ్ బోర్డ్, గీజర్, ఎగ్జాస్టర్ ఫ్యాన్ వంటి ఎలక్ట్రికల్ వాస్తువులు ఆగ్నేయ దిశలో ఉంచాలి. బాత్ రూమ్ కోసం లేత రంగు టైల్స్ ఎంపిక చేసుకోవాలి. వాస్తు ప్రకారం నీలం రంగు బాత్ రూమ్ కి వేసుకుంటే మంచిది. ఇది సంతోషాన్ని సూచిస్తుంది. అందుకే నీలం రంగు బకెట్లు, మగ్గులు మాత్రమే బాత్ రూమ్ లో ఉండేలా చూసుకోండి.

కిటికీ తప్పనిసరి

బాత్ రూమ్ కి కిటికీ ఉండటం చాలా ముఖ్యం. ఇది నెగటివ్ ఎనర్జీని తరిమివేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే కిటికీ తూర్పు, ఉత్తర లేదా పడమర దిశలో ఉండాలి.

Whats_app_banner