Goddess lakshmi devi: ఈ వాస్తు నియమాలు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు సంపదతో నిండిపోతుంది-maa lakshmi will come to your door money increases with these vastu tips ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Lakshmi Devi: ఈ వాస్తు నియమాలు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు సంపదతో నిండిపోతుంది

Goddess lakshmi devi: ఈ వాస్తు నియమాలు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు సంపదతో నిండిపోతుంది

Gunti Soundarya HT Telugu
Aug 06, 2024 03:17 PM IST

Goddess lakshmi devi: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించడం ఉత్తమం. ఇవి మీకు సంపద, సంతోషాన్ని తీసుకొస్తాయి. ఇల్లు ఆనందంగా ఉంటుంది.

లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే వాస్తు నియమాలు
లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే వాస్తు నియమాలు (pinterest)

Goddess lakshmi devi: ప్రతి ఒక్కరూ తమ ఇల్లు సంపదతో నిండిపోవాలని కోరుకుంటారు. కీర్తిని పొందాలని ఆశపడతారు. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం వాస్తు శాస్త్రం కొన్ని చిట్కాలు చెబుతుంది. వీటిని పాటించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నివశిస్తుంది. సంపద, సంతోషాన్ని తీసుకొస్తుంది.

ఈ వాస్తు మార్పులు డబ్బు సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడతాయని నమ్ముతారు. వాస్తు లోపం లేని ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సంతోషం నిండిపోతుంది. అందుకే వాస్తు ప్రకారం ఈ దిశల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ఉత్తర దిశ

వాస్తులో ఉత్తర దిశకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కుబేరుడిది ఉత్తర దిక్కు అని చెబుతారు. ఈ దిశను శుభ్రంగా అలంకరించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభం వస్తుంది. ఇది కుబేరుని దిక్కు కాబట్టి డబ్బును ఉత్తరం వైపు భద్రపరచాలి.

ఇది కాకుండా ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచండి. ఈ దిశలో దేవతలను ప్రతిష్టించండి ఎందుకంటే ఇది వారి స్థలం. మీ వాస్తు ప్రకారం ఈ రెండు దిక్కులు లేకుంటే మీకు ఇబ్బందులు తప్పవు.

ఈ దిశలో నిద్రపోవాలి

నిద్రించే భంగిమ కూడా సరిగా ఉండాలని చెబుతారు. నిద్రపోయేటప్పుడు నోరు తెరిచి నిద్రపోకూడదు. ఇది మీ శరీరానికి అనేక వ్యాధులను కలిగిస్తుంది. అలాగే తడి పాదాలతో పడుకోకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వాస్తు ప్రకారం తలను తూర్పు దిశలో ఉంచి నిద్రపోవడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో పడుకుంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. అదే విధంగా పడమర దిశలో తల పెట్టుకుని పడుకోకూడదు. ఇది జీవితంలో అనేక సమస్యలను తీసుకొస్తుంది. ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వైవాహిక జీవితంలోను సమస్యలు కలిగిస్తుంది.

మంచం మీద అన్నం తినొద్దు

వాస్తు ప్రకారం మంచం మీద కూర్చుని ఆహారం తినడం మంచిది కాదు. ఇది ఇంట్లో పేదరికాన్ని తీసుకొస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచం మీద కూర్చుని ఆహారం తీసుకోవడం వల్ల ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. వాస్తు లోపాలు ఏర్పడతాయి. అలాగే రాహువు అశుభ ఫలితాలు ఇస్తాడని ఇంట్లో అలజడి కలుగుతుందని చెబుతారు. మంచం మీద కూర్చుని అన్నం తింటే అన్నపూర్ణ దేవి కూడా అసంతృప్తి చెందుతుంది. అందుకే చక్కగా నేల మీద కూర్చుని అన్నం తినాలి. ఇది ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం.

అలాంటి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి

కొంచెం బలంగా ఉన్న మొక్కను తీసుకొని దానిని సంరక్షించండి. అది బాగా పెరిగేలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది పెరుగుతున్న కొద్దీ మీరు ప్రయోజనం పొందుతారు. మీ ఇంట్లో ఒక కుండీలో బంగాళదుంప మొక్కను నాటండి.

ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మీ నాభిపై పసుపును రాయండి. ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఏ కుళాయి నుంచి నీరు లీకేజ్ కాకుండా చూసుకోవాలి. లేదంటే డబ్బు వృధా అవుతుంది. బంగారు నాణేలను జారవిడుచుకునే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఆగ్నేయ దిశలోప్రతిష్టించుకోవాలి.

నీలం రంగు పిరమిడ్‌ను కూడా ఉత్తరం వైపు ఉంచాలి. అది మీ సంపదను పెంచుతుందని చెబుతారు. ఒక పెద్ద గాజు గిన్నెను ఉత్తరం వైపు ఉంచి అందులో వెండి నాణేలు వేయాలి. తూర్పు-ఉత్తర మూలలో వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి పూజించండి. ఇంటి ఈశాన్య మూలలో మురికి ఉండకూడదు. ఉసిరి చెట్టు లేదా తులసి మొక్కను ఉత్తరం వైపున నాటండి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాపిక్