Feng shui tips: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందా? అయితే ఈ చిన్న వస్తువులు పెట్టుకోండి చాలు
Feng shui tips: ఏ ఇంట్లో అయితే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. ఆర్థికం, వృత్తి, వ్యాపారం, కుటుంబం ఇలా అన్నింటిలోనూ ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ ఇంట్లోనూ నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తుందా అయితే ఈ చిన్న వస్తువులు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోండి చాలు.
ఇంట్లో ఎప్పుడూ సానుకూల వాతావరణం ఉండాలి. అప్పుడే ఆ కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అదే నెగటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తి పురోగతిలో ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు వాస్తు, ఫెంగ్ షూయి చిట్కాలు అనేకం ఉన్నాయి.
ఫెంగ్ షూయి గ్రంథం ప్రకారం ఇంటి నిర్వహణ కోసం అనేక పరిష్కారాలు సూచించబడ్డాయి. చాలా సార్లు వాస్తు దోషాల కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల మీరు మీ ఇంట్లో సానుకూల శక్తిని కొనసాగించాలనుకుంటే మీరు ఈ ఫెంగ్ షూయి చర్యల సహాయం తీసుకోవచ్చు. నెగటివ్ ఎనర్జీని తగ్గించేందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఏవేవో కొనాల్సిన పని లేదు. ఈ చిన్న వస్తువులు మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు.
విండ్ చైమ్
విండ్ చైమ్ ఒక అదృష్ట ఫెంగ్ షూయి వస్తువు. ఇది అదృష్టాన్ని ఆకర్షిస్తుంది, సానుకూలతను నిర్వహిస్తుంది. అందువల్ల స్టడీ రూమ్ నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి విండ్ చైమ్‌ను ఇన్‌స్టాల్ చేయండి. గాలి వీచినప్పుడు విండ్ చైమ్ అటూ ఇటూ కదలడం వల్ల వచ్చే శబ్ధం ఇంట్లో పాటిటివిటీని పెంచుతుంది. ఇంటి ఉత్తర లేదా పడమర దిశలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే డోర్ లేదా కిటికీపై కూడా వీటిని పెట్టుకోవడం మంచిది. 7 లేదా 8 రాడ్లతో కుడైన విండ్ చాయిమ్ ఇన్ స్టాల్ చేసుకుంటే కుటుంబంలో సంతోషం, అదృష్టం పెరుగుతుంది.
జాడే ప్లాంట్
మీరు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నట్లయితే దీనికి కారణం ఇంటి ప్రతికూల శక్తి కూడా కావచ్చు. అందువల్ల మీరు మీ ఇంట్లో సానుకూలతను ఆకర్షించడాని, ఆనందం, శ్రేయస్సును పెంచడానికి జాడే మొక్కను నాటవచ్చు. చిన్న చిన్న ఆకులతో ఉండే ఈ మొక్క చూసేందుకు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని కుబేర మొక్క అని కూడా పిలుస్తారు.
మూడు నాణేలు
ఫెంగ్ షూయి ప్రకారం చైనీస్ మూడు నాణేలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ నాణేలను ఎర్రటి గుడ్డలో చుట్టి లేదా ఎర్రటి దారంలో కట్టి ఉంచడం వల్ల పేదరికం తొలగిపోతుందని, ధన ప్రవాహం కొనసాగుతుందని నమ్ముతారు.
ఫిష్ అక్వేరియం
మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే మీ ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంచండి. ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోతుంది. ఇంటి తూర్పు, ఈశాన్య, ఉత్తర దిశలలో చేపల అక్వేరియం ఉంచుకోవచ్చు. వాస్తు ప్రకారం అక్వేరియంలో 8 నుంచి 9 చేపలు ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఇందులోని నీటిని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఉత్తర దిశలో ఉంచితే కెరీర్ లో పురోగతి ఉంటుంది. అదే తూర్పు దిక్కున ఉంచితే జీవితంలో ఆనందంరెట్టింపు అవుతుంది.
ఫెంగ్ షూయి తాబేలు
ఫెంగ్ షుయ్ తాబేలును ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచడం వల్ల సమాజంలో వ్యక్తి స్థానం, గౌరవ ప్రతిష్టలు పేరుగతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఫెంగ్ షూయి తాబేలు మీ ఆదాయాన్ని పెంచడానికి అదృష్ట ఆకర్షణగా నిరూపించవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.