ఏప్రిల్ 8, నేటి రాశి ఫలాలు.. గృహ నిర్మాణం చేపడతారు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి-april 8th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 8, నేటి రాశి ఫలాలు.. గృహ నిర్మాణం చేపడతారు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి

ఏప్రిల్ 8, నేటి రాశి ఫలాలు.. గృహ నిర్మాణం చేపడతారు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి

HT Telugu Desk HT Telugu
Apr 08, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ08.04.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 8, నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 8, నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 08.04 2024

వారం: సోమవారం, తిథి : అమావాస్య

నక్ష్మత్రం : ఉత్తరాభాద్ర, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. గృహనిర్మాణం లేదా స్థల సేకరణ చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమెషన్‌ లభిస్తుంది. కోరుకున్న చోటుకు బదిలీ అవుతారు. శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్ళేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మేష రాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుడిని అభిషేకించడం, పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం. సంతాన విషయంలో అభివృద్ధి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అధికారం, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థిక విషయాల్లో పురోగతిని సాధిస్తారు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ, కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనయోగముంది. షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. ఉన్నత పదవులు అందుకుంటారు. చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. విదేశీయాన ప్రయత్నం కలసివస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలుంటాయి. కర్కాటకరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వపత్రాలతో శివుడిని పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలుంటాయి. అధికారుల సహాయ సహకారాలుంటాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. శత్రువులు దూరం అవుతారు. మీరు కోరుకున్నవి అప్రయత్నంగా లభ్యమవుతాయి. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్టకాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అవసరానికి సాయం చేసేవారున్నారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. వృథా ప్రయాణాలుంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వృత్తి, వ్యాపారాల్లో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకమైన పనులు పూర్తిచేయగలుగుతారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. మీ పక్షాన ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. తులారాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు కలుగుతుంది. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలుంటాయి. ఆరోగ్యం అనుకూలించును. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీమీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు దూరంగా ఉండాలి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్నిస్తాయి. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. మీ రంగాల్లో మీదే పైచేయి అవుతుంది. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో కలసి ఉండటం వలన సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అనవసరంగా ఆందోళన పడటం తగ్గించుకుంటే మంచిది. సమస్యలకు కృంగిపోకుండా ముందుకు వెళ్ళటం మంచిది. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner