maha shivratri 2024: ఇంట్లో శివుడిని ఎలా పూజించాలి? శివరాత్రి రోజు ఏంచేయాలి?
శివరాత్రి 2024కి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. శివరాత్రికి శివుడిని ఎలా పూజించాలో తెలుసుకోండి. ఇంట్లో శివుడిని ఎలా పూజించాలో ఇక్కడ చెబుతున్నాం.
(1 / 6)
శివరాత్రి మరికొన్ని రోజుల్లో వచ్చేస్తుంది. శివరాత్రి రోజు శివుడిని ఘనంగా పూజిస్తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ శివరాత్రి రోజు శివుడిని ఎలా పూజించాలో శాస్త్రాలు చెబుతున్నాయి.
(2 / 6)
పురాణాల ప్రకారం, శివలింగం లేదా శివుని విగ్రహం ఎల్లప్పుడూ ఇంట్లో ఈశాన్య ముఖంగా ఉండాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. శివలింగాన్ని ఈశాన్య మూలన ఉంచితే ప్రమాదాలు రాకుండా ఉంటాయి. శివలింగాన్ని ఉంచే బలిపీఠాన్ని శుభ్రం చేసి అప్పుడు శివలింగాన్ని ఉంచాలి.
(3 / 6)
పురాణాల ప్రకారం ఇంట్లో శివుని ధ్యానంలో ఉన్న ఫోటోను, విగ్రహాన్ని ఉంచితే మంచిది. ఇలాంటి ఫోటో లేదా విగ్రహం ఉంచితే అన్ని సంతోషాలను ఇస్తుందని చెబుతారు. కాబట్టి ఇంట్లో శివుని చిత్రపటాన్ని ఉంచుకుంటే ఆయన ధ్యాన విగ్రహాన్ని ఉంచుకోవడం మంచిది.
(4 / 6)
శాస్త్రాల ప్రకారం నలుపు రంగులో ఉన్న శివలింగాన్నే ఎంచుకోవాలి. తెల్లని శివలింగాన్ని పూజించవద్దని శాస్త్రాలు సూచిస్తున్నాయి. తెల్లని శివలింగం సన్యాసానికి చిహ్నంగా చాలా మంది భావిస్తారు. నలుపు రంగు శివలింగం ఇంట్లో వారికి ఎంతో మేలు చేస్తుంది.
(5 / 6)
నర్మదా నది ఒడ్డున రాళ్లతో చేసిన శివలింగాన్ని పూజిస్తే మేలు జరుగుతుందని శివపురాణం చెబుతోంది. ఇంట్లో ఒకే వేదికపై ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉంచకూడదు. శివలింగం ఉంచే పాత్రలో బంగారం, వెండి, రాగి ఉంటే మంచిది.
ఇతర గ్యాలరీలు