ఏప్రిల్ 7, నేటి రాశి ఫలాలు.. పుణ్యక్షేత్రాల సందర్శన, ప్రముఖులతో పరిచయాలు-april 7 th today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 7, నేటి రాశి ఫలాలు.. పుణ్యక్షేత్రాల సందర్శన, ప్రముఖులతో పరిచయాలు

ఏప్రిల్ 7, నేటి రాశి ఫలాలు.. పుణ్యక్షేత్రాల సందర్శన, ప్రముఖులతో పరిచయాలు

HT Telugu Desk HT Telugu
Apr 07, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ07.04.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 7వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 7వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 07.04 2024

వారం: ఆదివారం, తిథి : త్రయోదశి

నక్షత్రం : పూర్వాభాద్ర, మాసం : ఫాల్గుణం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. అన్నదమ్ములతో ఆనందముగా గడుపుతారు. ఖర్చులు నియంత్రించుకోవాలి. స్పెక్యులేషన్‌లకు, పెట్టుబడులకు దూరంగా ఉండుట మంచిది. కుటుంబములో చిన్న తరహా చికాకులుంటాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహనాలకు రిపేర్లు చేయవలసి రావచ్చును. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు, ప్రమోషన్లు వంటివి ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. విద్యార్థులకు నూతన కోర్సులందు అవకాశాలు ఏర్పడతాయి. అన్ని విషయాలయందు జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణ ఆలోచనలో ఆటంకాలు తొలగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృషభరాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. సోదరులను కలుసుకుని వివాహ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలుంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్యనారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పఠించండి.

సింహ రాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగులు అధికారులతో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన వ్యయ సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సింహ రాశి వాళ్ళు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. దూర ప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందట కోసం సూర్యభగవానుడిని పూజించి బెల్లం పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగముంది. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించినా లాభాలు అందుకుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహనిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలుంటాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్ట్రకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన గృహ యోగమున్నది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్త వింటారు. ఆరోగ్య సమస్యల బాధిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగమున్నది. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబముతో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. కుంభరాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మిత్రులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. ప్రముఖులతో చర్చలు విఫలమవుతాయి. ఏ పని చేపట్టినా నిరాశ పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పై అధికారులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధువులనుండి శుభవార్తలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel