మార్చి 2, నేటి రాశి ఫలాలు.. వివాదాలు పరిష్కారం అవుతాయి, వాహనం కొనుగోలు చేస్తారు-today dina phalalu march 1st rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్చి 2, నేటి రాశి ఫలాలు.. వివాదాలు పరిష్కారం అవుతాయి, వాహనం కొనుగోలు చేస్తారు

మార్చి 2, నేటి రాశి ఫలాలు.. వివాదాలు పరిష్కారం అవుతాయి, వాహనం కొనుగోలు చేస్తారు

HT Telugu Desk HT Telugu
Mar 05, 2024 12:51 PM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ02.03.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 2వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 2వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 02.03. 2024

వారం: శనివారం, తిథి : షష్టి

నక్షత్రం : విశాఖ, మాసం : మాఘం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబసభ్యులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిళ్ళు. స్వల్ప ధనలాభముండును. రాజకీయ నాయకుల పర్యటనలు వాయిదా. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందముగా గడుపుతారు. వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలుండును. కుటుంబ సభ్యులతో గొడవలు. వాహనయోగముంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభ సమయం. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కుటుంబ సౌఖ్యం. నూతన ఉద్యోగ ప్రాప్తి. వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలసి వస్తాయి. ధనవ్యయముందును. శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీరు చేస్తున్న పనులు ఆలస్యం అయినా చివరికి పూర్తి చేస్తారు. ఇతరులకు సాయం అందిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఖర్చులు నియంత్రించుకోవాలి. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేయు ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు కొంత పని ఒత్తిళ్ళు తప్పవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలుంటాయి. విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగమున్నది. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వస్తు, వస్త్ర లాభాలుంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ధనవ్యయముండును. రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారమవుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు మధ్యస్థ సమయం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిచయాలు పెరుగుతాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఊహించని బాధ్యతలు. బంధు విరోధాలేర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. నూతన వ్యక్తుల పరిచయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొద్దిపాటి లాభాలుంటాయి. ఒత్తిడులు తొలగుతాయి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలించి ఆనందముగా పనిచేస్తారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. భూ, గృహ యోగాలున్నాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని పదవులు దక్కవచ్చు. కుటుంబ సమస్యలుంటాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు తీరి ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథపప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. వృథా ఖర్చులుంటాయి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు, వివాదాలు తొలగుతాయి. శ్రమ ఫలిస్తుంది. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులకు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు అవార్డులు. విద్యార్థులు చేయు ప్రయత్నాలు కలసివస్తాయి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner