LULU Back To AP : ఏపీకి తిరిగి వస్తున్న లులు, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి
LULU Back To AP : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబుతో లులు సంస్థ ప్రతినిధులు శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు లులు సంస్థను ఆహ్వానించారు. దీంతో ఈ సంస్థ ఏపీలో పెట్టుబడులపై ఆసక్తి చూపింది.
LULU Back To AP : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లులు గ్రూప్‌ను సీఎం చంద్రబాబు ఏపీకి ఆహ్వానించారు. సీఎం ఆహ్వానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ పచ్చ జెండా ఊపింది. లులు గ్రూప్ ఏపీకి తిరిగివచ్చినందుకు సంతోషిస్తున్నానని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు లులు సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఈ సంస్థకు అవసరమైన సహకారం అందజేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
విశాఖ, విజయవాడ, తిరుపతిలో లులు ప్రణాళికలపై చర్చించామన్నారు. లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ ఆలీతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో లులు మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ ఏర్పాటుకు ఈ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనే భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
లులు గ్రూప్ ను ఏపీకి తిరిగి స్వాగతించేందుకు తాను సంతోషిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. లులు ఛైర్మన్ యూసుఫ్ ఆలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలీ బృందం అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పెట్టుబడుల అంశంపై చర్చింరారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులతో పాటు వైజాగ్‌లో మాల్ మల్టీప్లెక్స్, హైపర్‌మార్కెట్, విజయవాడ, తిరుపతిలో మల్టీప్లెక్స్‌ల ప్రణాళికలను లులు బృందంతో చర్చించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వం సాధ్యమైన ప్రతి సహకారం, మద్దతును అందిస్తుందన్నారు. తన మిత్రుడైన యూసఫ్ అలీ ప్రయత్నాలలో మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఫలవంతమైన భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
విరాళాలు
వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, సీఎమ్ఆర్ గ్రూప్ విరాళం అందించాయి. జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ తరపున ఆ సంస్థ ప్రతినిధులు రామచంద్రరాజు, గంగాప్రసాద్ రూ.1 కోటి,. సీఎమ్ఆర్ గ్రూప్ ఛైర్మన్ మావూరి వెంకటరమణ రూ.50 లక్షల విరాళంను సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం ఉండవల్లి నివాసంలో కలిసి అందించారు.
సంబంధిత కథనం