Pak Musician Tribute | భారతీయుల హృదయాలను గెలుచుకున్న పాకిస్థానీ కళాకారుడు.. జనగణమనతో ప్రత్యేక నివాళి!-pak musician plays jana gana mana on rabab calls it gift to indians ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pak Musician Tribute | భారతీయుల హృదయాలను గెలుచుకున్న పాకిస్థానీ కళాకారుడు.. జనగణమనతో ప్రత్యేక నివాళి!

Pak Musician Tribute | భారతీయుల హృదయాలను గెలుచుకున్న పాకిస్థానీ కళాకారుడు.. జనగణమనతో ప్రత్యేక నివాళి!

Aug 16, 2022 05:14 PM IST HT Telugu Desk
Aug 16, 2022 05:14 PM IST

భారతదేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ పాకిస్థానీ కళాకారుడు భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపేందుకు విశిష్టమైన ఆలోచనతో ముందుకువచ్చాడు. పాకిస్థాన్‌కు చెందిన రబాబ్ వాయిద్యకారుడు సియాల్ ఖాన్.. భారత జాతీయ గీతమైన 'జన గణ మన' ను లయబద్ధంగా వాయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'సరిహద్దులో ఉన్న భారతీయులకు ఇదిగో నా బహుమతి' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో భారతీయుల హృదయాలను గెలుచుకుంది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకి ట్విట్టర్లో 12 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి.  వీడియోని మీరూ చూసేయండి.

More