Tata Tigor iCNG : స్టైలిష్ లుక్‌లో టిగోర్ సీఎన్‌జీ కారు.. ధర ఎంతంటే!-2022 tata tigor icng first drive review better than its petrol and ev avatar ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tata Tigor Icng : స్టైలిష్ లుక్‌లో టిగోర్ సీఎన్‌జీ కారు.. ధర ఎంతంటే!

Tata Tigor iCNG : స్టైలిష్ లుక్‌లో టిగోర్ సీఎన్‌జీ కారు.. ధర ఎంతంటే!

Jan 27, 2022, 02:32 PM IST Rekulapally Saichand
Jan 27, 2022, 02:32 PM , IST

  • దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సీఎన్‌జీ వాహనాలపై దృష్టిపెట్టింది. తాజాగా సీఎన్‌జీ ప్యాసింజ‌ర్ సెగ్మెంట్‌లో టిగోర్ ఐ-సీఎన్‌జీ (Tata Tigor iCNG) వెహిక‌ల్‌ను మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్స్, ఇంజన్ పని తీరు వంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా టిగోర్ iCNG ధర రూ.7.69 లక్షల (ఎక్స్‌ షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది. 1.2 లీటర్‌ బీఎస్‌-6 ఇంజిన్‌ సామర్ధ్యంతో ఈ కారును రూపొందించారు. ఇది 73 పీఎస్‌ గరిష్ఠ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది.

(1 / 13)

సీఎన్‌జీ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఉన్న మారుతి సుజుకి, హ్యుందాయ్ సీఎన్‌జీ కార్లకు పోటీగా ఇప్పుడు టాటా మోటార్స్ కూడా టియాగో సీఎన్‌జీ, టిగోర్ ఐ-సీఎన్‌జీ మోడల్స్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

(2 / 13)

టాటా Tigor I-CNG.. XZ, XZ ప్లస్ అనే వేరియంట్‌లలో లభిస్తుంది. టాప్-ఎండ్ కార్లలో CNG ఆప్షన్స్‌‌తో వస్తున్న మెుదటి కారు ఇదే. 

(3 / 13)

టాటా మోటార్స్ iCNG వేరియంట్లలో అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. టాటా టిగోర్ iCNGని.. స్టాండర్డ్ మోడల్‌ మాదిరిగా రూపొందించారు. 14-అంగుళాల హైపర్‌స్టైల్ వీల్స్ సెటప్‌తో  దాదాపు 5 మిమీ మేర వీల్‌బేస్ ఉంటుంది

(4 / 13)

కారు ముందు భాగంలో రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటో హెడ్‌లైట్‌లను ఇచ్చారు. XZ+ వేరియంట్‌లో అయితే మాగ్నెటిక్ రెడ్ ఎక్స్‌టీరియర్ కలర్‌ను అందించారు. అలాగే ఈ కారు పైభాగంలో బ్లాక్ కలర్ రూఫ్‌తో డ్యూయల్ టోన్ థీమ్ ఆప్షన్ కూడా ఉంది.

(5 / 13)

Tigor iCNG క్యాబిన్‌ విషయానికి వస్తే డోర్‌లపై క్రోమ్ హ్యాండిల్స్‌తో పాటు లోపల ఇంటీరియర్ నలుపు, లేత గోధుమరంగు థీమ్‌తో సెట్ చేశారు. క్యాబిన్ లేఅవుట్ చాలావరకు స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.

(6 / 13)

డ్యాష్‌బోర్డులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, USB పోర్ట్‌లు, ఎలక్ట్రానిక్‌ ఫోల్డబుల్ ORVM మొదలగు ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి.

(7 / 13)

Tigor iCNGలో స్పెషల్ స్విచ్ ఆప్షన్‌ ఇచ్చారు. ఈ స్విచ్ సహాయంతో CNG నుండి పెట్రోల్ మోడ్‌కు సులభంగా మారవచ్చు. కారులో CNG స్థాయి తక్కువ ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా పెట్రోల్‌ వర్షన్‌కు మారుతుంది.

(8 / 13)

డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ద్వారా కారు CNG మోడ్‌లో ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే CNG ఎంత స్థాయిలో ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు.

(9 / 13)

టాటా మోటార్స్.. Tigor iCNGని మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందిస్తోంది. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ మోడల్‌ లభిస్తోంది.

(10 / 13)

టిగోర్ iCNG సీట్లు, స్పేస్, ఇతర ఫీచర్లు పెట్రోల్ వేరియంట్‌ కార్లలాగే ఉంటాయి. వెనుక సీట్లకు సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్‌ ఆప్షన్ ఉంటుంది.

(11 / 13)

బూట్ స్పేస్‌లో 60-లీటర్ల సామర్థ్యం కలిగిన సీఎన్‌జీ సిలిండర్‌ను అమర్చారు. అంటే సుమారు 10 కిలోల గ్యాస్‌ సామర్థ్యంతో ఉంటుంది. ఈ CNG కిట్ కోసం స్టెయిన్‌లెస్-స్టీల్ ట్యూబ్‌ను ఉపయోగించారు. ఎలాంటి గ్యాస్ లీక్‌లు జరగకుండా అనేక టెస్ట్‌ల అనంతరం దీనిని ఫిక్స్ చేస్తారు.

(12 / 13)

టిగోర్ ఐసిఎన్‌జి మైలేజీకి సంబంధించి టాటా ఇప్పటికివరకు ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే 3.3 కిలోల గ్యాస్‌తో సుమారు 117 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.. అంటే కిలోకు 35 కిమీల వరకు మైలేజ్ ఇస్తుందని టెస్ట్ డ్రైవ్‌ ద్వారా వెల్లడైంది.

(13 / 13)

ఇతర గ్యాలరీలు