stock market holiday : మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు..
Stock market holiday : స్టాక్ మార్కెటలకు మంగళవారం సెలవు. ఈక్విటీతో పాటు డెరివేటివ్స్‌లో ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు.
stock market holiday : మంగళవారం, అంటే అక్టోబర్ 24న దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ఉండనుంది. దసరా నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు మూతపడి ఉంటాయి. పూర్తి వివరాలు..
స్టాక్ మార్కెట్ హాలిడే..
దక్షిణాది ప్రజలు దసరా పండుగను సోమవారం జరుపుకున్నారు. కాగా.. ఉత్తరాదిలో చాలా మంది ఈ దసరా పండుగను మంగళవారం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పనిచేసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం సెలవు తీసుకోనున్నాయి.
స్టాక్ మార్కెట్ సెలవులకు సంబంధించిన డేటా బీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో ఉంటుంది. bseindia.com లోకి వెళ్లి.. 'ట్రేడింగ్ హాలిడేస్' మీద క్లిక్ చేసి, సెలవుల లిస్ట్‌ను పొందొచ్చు. 2023కు సంబంధించిన పూర్తి సెలవుల డేటా కనిపిస్తుంది.
stock market holiday Dussehra : ఇక బీఎస్ఈ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం.. మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. దసరా నేపథ్యంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు సెలవులో ఉంటాయి. తిరిగి.. బుధవారం స్టాక్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి.
బీఎస్ఈ ప్రకారం.. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్, కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో మంగళవారం ట్రేడింగ్‌కి వీలు ఉండదు. కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ సెగ్మెంట్లు మార్నింగ్ సెషన్లో పని చేయవుత. మార్నింగ్ సెషన్ అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇక ఈవినింగ్ సెషన్లో కార్యకలాపాలు మొదలవుతాయి. ఈవినింగ్ సెషన్ అంటే సాయంత్రం 5 గంటల తరువాత.
ఈ నెలలో స్టాక్ మార్కెట్లకు ఇప్పటికే ఒక సెలవు లభించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మార్కెట్లు మూతపడ్డాయి. ఇక దసరాకి కూడా సెలవులో ఉంటాయి.
stock market holiday today : ఇక దసరా తర్వాత.. వచ్చే నెలలో దేశీయ సూచీలకు రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి. అవి.. నవంబర్ 14 (దీపావళి బలిప్రాతిపద), నవంబర్ 27 (గురునానక్ జయంతి). చివరిగా.. డిసెంబర్లో క్రిస్మస్ (డిసెంబర్ 25) రోజున స్టాక్ మార్కెట్లు పనిచేయవు.
సోమవారం ట్రేడింగ్ సెషన్..
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ విషయానికొస్తే.. దేశీయ సూచీలు దారుణంగా పతనమయ్యాయి. ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో దేశీయ మార్కెట్లు కూడా క్రాష్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 826 పాయింట్లు కోల్పోయి 64,572 వద్దకు చేరింది. ఇది నాలుగు నెలల కనిష్ఠం. ఎన్ఎస్ఈ నిఫ్టీ 261 పాయింట్ల లాస్‌తో 19,281 వద్ద సథిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 2.88శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 3.8శాతం మేర నష్టపోయాయి.
2007 తర్వాత.. అమెరికా 10- ఇయర్ బాండ్ యీల్డ్స్ తొలిసారి 5శాతాన్ని తాకడం కూడా నేటి ఇండియన్ స్టాక్ మార్కెట్ క్రాష్‌కు కారణమని నిపుణులు చెబుతున్నారు.
stock market news today : బీఎస్ఈ సెన్సెక్స్ 30లోని 28 స్టాక్స్.. నష్టాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.99శాతం, టాటా స్టీల్ 2.52శాతం, టీసీఎస్ 2.4శాతం, టాటా మోటార్స్ 2.3శాతం మేర నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం షేర్లు మాత్రమే స్వల్పంగా లాభాలను చూశాయి.
సంబంధిత కథనం