Monsoon Diet | వర్షాకాలంలో బయట తింటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!-dos and don ts to follow while eating out during monsoon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Monsoon Diet | వర్షాకాలంలో బయట తింటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!

Monsoon Diet | వర్షాకాలంలో బయట తింటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!

Jul 10, 2022, 09:58 AM IST HT Telugu Desk
Jul 10, 2022, 09:58 AM , IST

  • మీ స్నేహితులతో కలిసి బయట పార్టీకి ప్లాన్ చేస్తున్నారా? వర్షాకాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహార నిపుణులు అందించే ఈ టిప్స్ పాటించండి.

మాన్‌సూన్ సమయంలో బయటకు వెళ్లి గడపటం అంటే ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఆహారం కారణంగా అనారోగ్యం పాలయ్యే సీజన్ కూడా ఇదే. వర్షాకాలంలో బయటి ఆహారం తినేటపుడు ఫుడ్ పాయిజనింగ్‌కి గురికాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో న్యూట్రిషనిస్ట్ వ్యూహిత కొన్ని చిట్కాలను అందిస్తున్నారు.

(1 / 7)

మాన్‌సూన్ సమయంలో బయటకు వెళ్లి గడపటం అంటే ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఆహారం కారణంగా అనారోగ్యం పాలయ్యే సీజన్ కూడా ఇదే. వర్షాకాలంలో బయటి ఆహారం తినేటపుడు ఫుడ్ పాయిజనింగ్‌కి గురికాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో న్యూట్రిషనిస్ట్ వ్యూహిత కొన్ని చిట్కాలను అందిస్తున్నారు.(Pexels)

మంచి రెస్టారెంట్ ఎంచుకోండి. డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్, ఫుడ్ కౌంటర్లు, హ్యాండ్ వాష్ ఏరియా, కిచెన్ మొదలైనవి పరిశుభ్రంగా ఉన్నాయో, లేవో చూడండి. అలాగే వడ్డించేవారు, తయారు చేసేవారు చేతికి తొడుగులు, ముఖానికి, తలకు మాస్కులు వేసుకోవాలి. పెస్ట్ కంట్రోల్ చేసే చర్యలు ఉండాలి. అలాంటి రెస్టారెంట్ అయితేనే భోజనం చేయండి.

(2 / 7)

మంచి రెస్టారెంట్ ఎంచుకోండి. డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్, ఫుడ్ కౌంటర్లు, హ్యాండ్ వాష్ ఏరియా, కిచెన్ మొదలైనవి పరిశుభ్రంగా ఉన్నాయో, లేవో చూడండి. అలాగే వడ్డించేవారు, తయారు చేసేవారు చేతికి తొడుగులు, ముఖానికి, తలకు మాస్కులు వేసుకోవాలి. పెస్ట్ కంట్రోల్ చేసే చర్యలు ఉండాలి. అలాంటి రెస్టారెంట్ అయితేనే భోజనం చేయండి.(Hindustan Times)

మాంసాహారం తినడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వర్షాకాలంలో మాంసం నిల్వ, శుభ్రత విషయంలో అనేక అనుమానాలు ఉంటాయి. వర్షాకాలంలో మాంసంపై హానికర సాల్మొనెల్లా, క్లోస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్ వంటి సూక్ష్మక్రిములు సులభంగా వృద్ధి చెందుతాయి. కాబట్టి పిల్లలు, వృద్ధులు, గర్భినీలు, రోగ నిరోధక శక్తి తక్కువ కలిగిన వారు ఈ కాలంలో మాంసం తినకండి. సీఫుడ్ కు మరింత దూరంగా ఉండండి. గర్భిణీ స్త్రీలలో శిశువు ఎదుగుదల ప్రభావితం కావచ్చు, కాబట్టి మాంసాహారం సురక్షితం కాదు.

(3 / 7)

మాంసాహారం తినడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వర్షాకాలంలో మాంసం నిల్వ, శుభ్రత విషయంలో అనేక అనుమానాలు ఉంటాయి. వర్షాకాలంలో మాంసంపై హానికర సాల్మొనెల్లా, క్లోస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్ వంటి సూక్ష్మక్రిములు సులభంగా వృద్ధి చెందుతాయి. కాబట్టి పిల్లలు, వృద్ధులు, గర్భినీలు, రోగ నిరోధక శక్తి తక్కువ కలిగిన వారు ఈ కాలంలో మాంసం తినకండి. సీఫుడ్ కు మరింత దూరంగా ఉండండి. గర్భిణీ స్త్రీలలో శిశువు ఎదుగుదల ప్రభావితం కావచ్చు, కాబట్టి మాంసాహారం సురక్షితం కాదు.(Simrun Chopra)

ఉడికి ఉడకని వంటలు అస్సలు వద్దు. గ్రిల్డ్, హాల్ గ్రిల్డ్ వంటకాల కంటే కూడా కుక్కర్లో బాగా ఉడికించినవి తినండి.

(4 / 7)

ఉడికి ఉడకని వంటలు అస్సలు వద్దు. గ్రిల్డ్, హాల్ గ్రిల్డ్ వంటకాల కంటే కూడా కుక్కర్లో బాగా ఉడికించినవి తినండి.(Pinterest)

స్ట్రీట్ ఫుడ్ వద్దే వద్దు. వీధులో లభించే ఆహారం సరిగ్గా నిల్వ చేయలేరు. వాటిని తింటే కలరా, టైఫాయిడ్, విరేచనాలు, కామెర్లు వంటి వ్యాధులు వస్తాయి.

(5 / 7)

స్ట్రీట్ ఫుడ్ వద్దే వద్దు. వీధులో లభించే ఆహారం సరిగ్గా నిల్వ చేయలేరు. వాటిని తింటే కలరా, టైఫాయిడ్, విరేచనాలు, కామెర్లు వంటి వ్యాధులు వస్తాయి.(Instagram/@sinfullyspicy)

వేడిగా తీసుకునే ఆహారాలు వేడిగానే తినాలి, చల్లని ఆహారాలు చల్లగానే తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నవి తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది.

(6 / 7)

వేడిగా తీసుకునే ఆహారాలు వేడిగానే తినాలి, చల్లని ఆహారాలు చల్లగానే తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నవి తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది.(Pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు