Healthy Foods for Toddler | వేడి వాతావరణంలో పసిపిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వండి!-healthy summer foods for your toddler ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Healthy Summer Foods For Your Toddler

Healthy Foods for Toddler | వేడి వాతావరణంలో పసిపిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వండి!

Jun 05, 2022, 02:06 PM IST HT Telugu Desk
Jun 05, 2022, 02:06 PM , IST

  • పసిపిల్లలకు వేడి వాతావరణంలో ప్రత్యేకమైన సంరక్షణ, పోషణ అవసరం ఉంటుంది. పసిపిల్లల్లో అనారోగ్య సమస్యలను నివారించడానికి క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో సీనియర్ న్యూట్రిషనిస్ట్ శివాని బైజల్ ఐదు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను సూచించారు.

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పసిపిల్లలకు ఏదిపడితే అది ఆహారంగా ఇవ్వకూడడు. ఇది వారిలో ఆకలిని, రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. పసిపిల్లల జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచటానికి అలాగే వారి ఎనర్జీ లెవెల్స్‌ను మెయింటెయిన్ చేయడానికి ప్రత్యేకమైన ఆహారాన్ని అందివ్వాలి.

(1 / 7)

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పసిపిల్లలకు ఏదిపడితే అది ఆహారంగా ఇవ్వకూడడు. ఇది వారిలో ఆకలిని, రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. పసిపిల్లల జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచటానికి అలాగే వారి ఎనర్జీ లెవెల్స్‌ను మెయింటెయిన్ చేయడానికి ప్రత్యేకమైన ఆహారాన్ని అందివ్వాలి.(Pinterest)

మారేడు పండు (Bael Fruit / Wood Apple) తాజా రసాన్ని పసిపిల్లల ఆహారంగా ఇవ్వాలి. దీని గుజ్జును తినిపించాలి లేదా పానకంలా చేసి ఇవ్వాలి. ఇందులో విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్ విటమిన్లు అలాగే పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పసిపిల్లలకు త్వరగా జీర్ణం అవుతుంది. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

(2 / 7)

మారేడు పండు (Bael Fruit / Wood Apple) తాజా రసాన్ని పసిపిల్లల ఆహారంగా ఇవ్వాలి. దీని గుజ్జును తినిపించాలి లేదా పానకంలా చేసి ఇవ్వాలి. ఇందులో విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్ విటమిన్లు అలాగే పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పసిపిల్లలకు త్వరగా జీర్ణం అవుతుంది. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.(Pinterest)

పసిపిల్లలకు ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన పెరుగు భోజనంలో కలిపి ఇవ్వాలి. ఇది మంచి ప్రోబయోటిక్. వారికి ఉదర సమస్యలు లేకుండా చేస్తుంది. అసిడిటీ, డయేరియా వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. లస్సీ, మజ్జిగ, పెరుగు అన్నం, పండ్ల రసాలతో కలిపి ఇవ్వవచ్చు.

(3 / 7)

పసిపిల్లలకు ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన పెరుగు భోజనంలో కలిపి ఇవ్వాలి. ఇది మంచి ప్రోబయోటిక్. వారికి ఉదర సమస్యలు లేకుండా చేస్తుంది. అసిడిటీ, డయేరియా వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. లస్సీ, మజ్జిగ, పెరుగు అన్నం, పండ్ల రసాలతో కలిపి ఇవ్వవచ్చు.(Pinterest)

శరీరంలో వేడిని తొలగించేందుకు బార్లీ విత్తనాలు అద్భుతమైన తృణధాన్యం. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను సాఫీగా సాగేలా చేస్తుంది, పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. బార్లీ నీరు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బార్లీ గంజి, బార్లీ సూప్ లేదా బార్లీతో అట్టు చేసి పసిపిల్లలకు తినిపించవచ్చు.

(4 / 7)

శరీరంలో వేడిని తొలగించేందుకు బార్లీ విత్తనాలు అద్భుతమైన తృణధాన్యం. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను సాఫీగా సాగేలా చేస్తుంది, పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. బార్లీ నీరు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బార్లీ గంజి, బార్లీ సూప్ లేదా బార్లీతో అట్టు చేసి పసిపిల్లలకు తినిపించవచ్చు.(Pinterest)

సోరకాయ లేదా ఆనపకాయలో సుమారుగా 96% నీరు ఉంటుంది. ఇది పసిపిల్లను హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, వారి శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ సొరకాయలో విటమిన్ సి, ఎ, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పసిబిడ్డలలో జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసిపిల్లలకు సోరకాయతో సూప్, రైతా, ఖీర్, రోటీగా చేసి ఇవ్వవచ్చు.

(5 / 7)

సోరకాయ లేదా ఆనపకాయలో సుమారుగా 96% నీరు ఉంటుంది. ఇది పసిపిల్లను హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, వారి శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ సొరకాయలో విటమిన్ సి, ఎ, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పసిబిడ్డలలో జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసిపిల్లలకు సోరకాయతో సూప్, రైతా, ఖీర్, రోటీగా చేసి ఇవ్వవచ్చు.(Pinterest)

తల్లి పాల తర్వాత పిల్లలకు ఉత్తమమైన పానీయం కొబ్బరి నీరు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. చల్లగా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. పిల్లలు తాగటానికి ఇష్టపడకపోతే నిమ్మ, పుదీనాతో కలిపి రుచిలో ట్విస్ట్ ఇవ్వవచ్చు.

(6 / 7)

తల్లి పాల తర్వాత పిల్లలకు ఉత్తమమైన పానీయం కొబ్బరి నీరు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. చల్లగా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. పిల్లలు తాగటానికి ఇష్టపడకపోతే నిమ్మ, పుదీనాతో కలిపి రుచిలో ట్విస్ట్ ఇవ్వవచ్చు.(Pinterest)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు