Anxiety in Kids | ఆందోళనలో చిన్నారులు.. గుర్తించేందుకు ఇవే సంకేతాలు-top signs of anxiety in kids you shouldn t ignore ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top Signs Of Anxiety In Kids You Shouldn't Ignore

Anxiety in Kids | ఆందోళనలో చిన్నారులు.. గుర్తించేందుకు ఇవే సంకేతాలు

Mar 04, 2022, 09:54 AM IST Geddam Vijaya Madhuri
Mar 04, 2022, 09:54 AM , IST

  • మీ పిల్లలు స్నేహితులతో కలవడానికి సంకోచిస్తున్నారా? లేదా చిన్న చిన్న సమస్యలకే కలత చెందుతున్నారా? అయితే వారు ఆందోళనలో ఉన్నారని గుర్తించండి. పిల్లలు చేసే కొన్ని పనులతో వారు ఆందోళనకు గురువతున్నారో లేదో తెలుసుకోవచ్చు. ఆ ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయంటే…

పిల్లలలో ఆందోళనను గుర్తించడం అంత సులభం కాదు, ఎందుకంటే వారు ఏం ఫీలవుతున్నారో చెప్పడం వారికి కష్టమే. తెలుసుకోవడం మనకి కష్టమే. కానీ ఆందోళన సమస్యలు ఉన్న పిల్లలను సామాజికంగా ఉన్న వ్యక్తులతో కలవకుండా లేదా కొన్ని రోజువారీ కార్యకలాపాలను చేయకుండా నిరోధించవచ్చు. పిల్లల్లో ఆందోళన ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. ముంబైలోని భాటియా హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ థెరపిస్ట్ డాక్టర్ మాయా కిర్పలానీ కొన్ని చిట్కాలను వెల్లడించారు.

(1 / 7)

పిల్లలలో ఆందోళనను గుర్తించడం అంత సులభం కాదు, ఎందుకంటే వారు ఏం ఫీలవుతున్నారో చెప్పడం వారికి కష్టమే. తెలుసుకోవడం మనకి కష్టమే. కానీ ఆందోళన సమస్యలు ఉన్న పిల్లలను సామాజికంగా ఉన్న వ్యక్తులతో కలవకుండా లేదా కొన్ని రోజువారీ కార్యకలాపాలను చేయకుండా నిరోధించవచ్చు. పిల్లల్లో ఆందోళన ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. ముంబైలోని భాటియా హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ థెరపిస్ట్ డాక్టర్ మాయా కిర్పలానీ కొన్ని చిట్కాలను వెల్లడించారు.(Unsplash)

తినడం, నిద్రపోవడంలో ఇబ్బందులు: ఆకలి తగ్గడం లేదా పెరగడం అనేది ఆందోళనకు సంకేతం. మీ పిల్లవాడు భోజన సమయాలలో చాలా కుయుక్తులు విసురుతున్నట్లయితే.. ఇది కొంతకాలంగా జరుగుతుంటే.. మీరు వైద్య నిపుణులను సంప్రదించవలసిన సమయం ఆసన్నమైనట్లే. ఆందోళన కూడా నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. మీ బిడ్డ రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోలేకపోతే, అది ఆందోళనకు సంకేతం కావచ్చు.

(2 / 7)

తినడం, నిద్రపోవడంలో ఇబ్బందులు: ఆకలి తగ్గడం లేదా పెరగడం అనేది ఆందోళనకు సంకేతం. మీ పిల్లవాడు భోజన సమయాలలో చాలా కుయుక్తులు విసురుతున్నట్లయితే.. ఇది కొంతకాలంగా జరుగుతుంటే.. మీరు వైద్య నిపుణులను సంప్రదించవలసిన సమయం ఆసన్నమైనట్లే. ఆందోళన కూడా నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. మీ బిడ్డ రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోలేకపోతే, అది ఆందోళనకు సంకేతం కావచ్చు.(Pexels)

చదువులో వెనుకబడటం: పాఠశాలలో మీ పిల్లల పనితీరు క్షీణిస్తూ ఉంటే.. అతను/ఆమె మునుపటిలా విద్యపై ఆసక్తి చూపించకపోతే వారు ఆందోళనతో బాధపడుతున్నారని మనం గుర్తించాలి.

(3 / 7)

చదువులో వెనుకబడటం: పాఠశాలలో మీ పిల్లల పనితీరు క్షీణిస్తూ ఉంటే.. అతను/ఆమె మునుపటిలా విద్యపై ఆసక్తి చూపించకపోతే వారు ఆందోళనతో బాధపడుతున్నారని మనం గుర్తించాలి.(Pexels)

మునుపటిలా.. వారి హాబీలు.. పనులపై అకస్మాత్తుగా ఆసక్తి కోల్పోవడం కూడా మీ పిల్లవాడిని ఆందోళనకు గురిచేస్తోందని చూపిస్తుంది.

(4 / 7)

మునుపటిలా.. వారి హాబీలు.. పనులపై అకస్మాత్తుగా ఆసక్తి కోల్పోవడం కూడా మీ పిల్లవాడిని ఆందోళనకు గురిచేస్తోందని చూపిస్తుంది.(Pexels)

పిల్లలు అందరికీ దూరం.. దూరంగా, ఒంటరిగా ఉంటుంటే అది ఆందోళనకు సంకేతమే, తోటివారితో కలవకుండా ఉండటం.. అతిగా ఏడవడం కూడా ఆందోళనకు సంకేతమే.

(5 / 7)

పిల్లలు అందరికీ దూరం.. దూరంగా, ఒంటరిగా ఉంటుంటే అది ఆందోళనకు సంకేతమే, తోటివారితో కలవకుండా ఉండటం.. అతిగా ఏడవడం కూడా ఆందోళనకు సంకేతమే.(Pexels)

వయసు పెరుగుతున్నా మంచంపై టాయిలెట్​ పోయడం..  బొటనవేలు చప్పరించడం వంటి అంశాలు ఆందోళనకు సంకేతాలు.

(6 / 7)

వయసు పెరుగుతున్నా మంచంపై టాయిలెట్​ పోయడం..  బొటనవేలు చప్పరించడం వంటి అంశాలు ఆందోళనకు సంకేతాలు.(Pexels)

మీ పిల్లల్లో ఈ మార్పులు గమనిస్తే.. వారు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారని భావిస్తే.. మీరు నిపుణుడిని సంప్రదించవచ్చు.

(7 / 7)

మీ పిల్లల్లో ఈ మార్పులు గమనిస్తే.. వారు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారని భావిస్తే.. మీరు నిపుణుడిని సంప్రదించవచ్చు.(Pexels)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు