Weather update : ఇంకొన్ని రోజుల పాటు ఎండల నుంచి ఉపశమనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Telangana rains latest news : దిల్లీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భయంకరమైన ధూళి తుఫానుతో భారీ వర్షాలు పడ్డాయి. శనివారం కూడా దిల్లీలో వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. అదే సమయంలో.. పశ్చిమ్ బెంగాల్, జమ్మకశ్మీర్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..!
దేశ రాజధాని దిల్లీలో మే 11, 12 తేదీల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని, మే 16 వరకు ఇలాగే ఉంటుందని పేర్కొంది. నేడు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 39 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.
ఇతర వాయవ్య రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. హరియాణా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్లో మే 13 వరకు, రాజస్థాన్లో మే 12 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక పేర్కొంది. మే 14 వరకు గుజరాత్లోని తీరప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది.
“ఈశాన్య అసోంలో ఒక సైక్లిక్ సర్క్యులేషన్, తూర్పు బంగ్లాదేశ్లో మరో సక్లిక్ సర్క్యులేషన్, అసోం నుంచి ఉత్తర ఒడిశా వరకు అల్పపీడన ద్రోని కొనసాగుతోందని ఏర్పడింది,” ఐఎండీ పేర్కొంది.
Andhra Pradesh rains : అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో మే 16 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయి.
పశ్చిమ్ బెంగాల్, సిక్కింలో రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఇక బీహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
IMD rain alert : మే 12, 13 తేదీల్లో కర్ణాటక, కేరళ, మే 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మే 12న తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు మే 12న మరో వడగళ్ల వాన హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పశ్చిమ బెంగాల్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావం..
లుగు రాష్ట్రాల్లో మండే ఎండల నుంచి మరో మూడ్రోజుల పాటు ఉపశమనం లభించనుంది. ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర నుండి కర్ణాటక వద్ద ఆవర్తనం మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని ఏపీ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం