UPSC Civils Prelims Result 2024 : యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇలా రిజల్ట్ చెక్ చేసుకోండి
UPSC CSE Prelims Result 2024 Check : యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలని అనుకున్నవారు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
UPSC 2024 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక UPSC వెబ్‌సైట్ upsc.gov.inలో చెక్ చేయవచ్చు. మెయిన్స్ పరీక్షకు అర్హులైన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితాను విడుదల చేశారు.
UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు 2024 దేశవ్యాప్తంగా జూన్ 16న వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. జనరల్ స్టడీస్, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CSAT)ని కవర్ చేసే రెండు షిఫ్టులలో 13.4 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
జనరల్ స్టడీస్ (పేపర్ I)లో ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎకాలజీ, అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్ 2)లో రీజనింగ్, ఎనలిటికల్ ప్రశ్నలు, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు, డెసిషన్ మేకింగ్ ప్రశ్నలు ఉంటాయి.
పరీక్షలో ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు నాలుగు ఎంపికలను అందిస్తాయి. మొత్తం 400 మార్కులను కలిగి ఉంటాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులు తదుపరి దశకు హాజరయ్యేందుకు అర్హులు. అంటే UPSC సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష 2024 , తర్వాత ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది.
UPSC CSE ప్రిలిమ్స్ ఫలితాలు 2024 ఇలా చెక్ చేయండి
అభ్యర్థులు తమ ఫలితాలను కింది వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు
upsc.gov.in
upsconline.nic.in
UPSC CSE ప్రిలిమ్స్ ఫలితాలు 2024 ఎలా చెక్ చేయాలి
upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఫలితం 2024 లింక్‌పై క్లిక్ చేయండి
కొత్త పేజీ కనిపిస్తుంది. UPSC CSE రోల్ నంబర్/రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ (DOB) వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి
సబ్మిట్‌పై క్లిక్ చేయండి. ఫలితం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
UPSC CSE ప్రిలిమ్స్ 2024 ఫలితాలను తనిఖీ చేసి, డౌన్‌లోడ్ చేసుకోండి
ప్రింటవుట్ తీసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం హార్డ్ కాపీని మీ దగ్గర ఉంచుకోండి.
UPSC ప్రిలిమ్స్ ఉత్తీర్ణత ప్రమాణాలు
UPSC CSE ప్రిలిమ్స్ పరీక్షను క్లియర్ చేయడానికి, ఒక అభ్యర్థి జనరల్ స్టడీస్ పేపర్ 2లో కనీసం 33శాతం స్కోర్ చేయాలి. జనరల్ స్టడీస్ పేపర్ 1లో మొత్తం అర్హత మార్కులను అందుకోవాలి. UPSC క్యాలెండర్ ప్రకారం కమిషన్ సెప్టెంబర్ 2024లో సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష నిర్వహిస్తుంది.
UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)తో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సేవలు, విభాగాల్లో 1,056 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.