నిద్రలో పరీక్ష రాస్తున్నట్టు, పరీక్షలు ఆలస్యమైనట్టు, ప్రిపేర్​ అవ్వన్నట్టు కలలు వస్తున్నాయా?

Unsplash

By Sharath Chitturi
Jun 29, 2024

Hindustan Times
Telugu

చదువు పూర్తై ఏళ్లు గడిచినా.. ఇంకా పరీక్షలు రాస్తూనే ఉన్నట్టు చాలా మందికి కలలు వస్తూ ఉంటాయి. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

Unsplash

పరీక్ష రాస్తున్నట్టు వచ్చే కలలు చాలా భయానకంగా ఉంటాయని చెబుతుంటారు. చాలా రియలిస్టిక్​గా ఉంటాయని అంటుంటారు.

Unsplash

ఇలాంటి కలలు మన ఎమోషన్​ పాటర్న్​ని రిఫ్లెక్ట్​ చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Unsplash

జీవితంలో ఏదైనా పరిస్థితి లేదా భవిష్యత్తులో వచ్చే సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఇలాంటి కలలు వస్తాయట.

Unsplash

జీవితంలో తీవ్ర ఒత్తిడి ఉన్నా, మానసికంగా ఇబ్బందులు ఉన్నా, కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటే ఇలాంటి కలలు వస్తాయి.

Unsplash

స్కూల్​ గురించి కలలు వస్తుంటే జీవితంలో ఏదో నేర్చుకుంటున్నట్టు, పరీక్షల గురించి డ్రీమ్స్​ వస్తుంటే.. బాధ్యతలు పెరుగుతున్నట్టు అర్థం.

Unsplash

జీవితంలో సరైన లైఫ్​స్టైల్​తో ఒత్తిడి తగ్గించుకుంటే ఇలాంటి కలల నుంచి దూరంగా ఉండొచ్చు.

Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels