PM Modi birthday : సాధారణ ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త నుంచి ప్రధాని స్థాయి వరకు- మోదీ ప్రస్తానం..-pm modi birthday 2024 see the timeline of his life and rise in bjp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Birthday : సాధారణ ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త నుంచి ప్రధాని స్థాయి వరకు- మోదీ ప్రస్తానం..

PM Modi birthday : సాధారణ ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త నుంచి ప్రధాని స్థాయి వరకు- మోదీ ప్రస్తానం..

Sharath Chitturi HT Telugu
Sep 17, 2024 10:17 AM IST

PM Modi birthday 2024 : నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మోదీ.. భారత దేశానికి మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడం వరకు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కేంద్ర పథకం లబ్ధిదారుతో ప్రధాని మోదీ
కేంద్ర పథకం లబ్ధిదారుతో ప్రధాని మోదీ (PTI)

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.. భారత దేశంలో ఈ పేరు ఒక సంచలనం! ప్రజలను ప్రభావితం చేసే విధంగా ప్రసంగాలు చేయడంలోనైనా, విపక్షాలను తన వాఖ్​చాతుర్యంతో ఇరకాటంలో పెట్టడంలోనైనా మోదీకి మోదీయే సాటి. ఒక్క మోదీ ఛరిష్మాతో, ‘మోదీ మేనియా’తో బీజేపీ ఎన్నో ఎన్నికలు సునాయాసంగా గెలిచిందంటే.. దేశ రాజకీయాల్లో నరేంద్రుడి ప్రభావం, ప్రజల్లో ఆయనకు ఉన్న క్రేజ్​ అర్థమవుతుంది. గుజరాత్​లోని వాద్​నగర్​లో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ మధ్యతరగతి హిందూ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు! దేశంలో కాంగ్రెసేతర ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా మోదీ సృష్టించిన రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో మరెవరికీ సాధ్యం కాదు! ప్రధాని మోదీ 74వ జన్మదినం సందర్భంగా.. ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి వరుసగా మూడుసార్లు భారత ప్రధాని వరకు ఆయన ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకోండి..

ఛాయ్​ వాలా టు ప్రధాని..

సెప్టెంబర్ 17, 1950: నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.. గుజరాత్​లోని వాద్ నగర్​లో జన్మించారు. చిన్న వయస్సులోనే సమీపంలోని ఆర్​ఎస్​ఎస్​ సభలకు వెళ్లడం మొదలుపెట్టారు.

1965: జమ్ముకశ్మీర్ పై భారత్-పాక్ యుద్ధం మొదలైంది. వాద్ నగర్ రైల్వే స్టేషన్ లో టీ విక్రయించేవారు.

1971- మోదీ ఆరెస్సెస్​లో అధికారికంగా చేరారు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో యుద్ధభూమిలో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలో దిల్లీలో జరిగిన జనసంఘ్ సత్యాగ్రహంలో మోద పాల్గొన్నారు.

1974: గుజరాత్​లో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మోదీ పాల్గొన్నారు.

1975: గుజరాత్​లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను సమన్వయం చేసే ఆరెస్సెస్ కమిటీ అయిన గుజరాత్​ లోక్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శిగా మోదీ నియమితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో ఆరెస్సెస్​ను బ్యాన్ పడింది. గుజరాత్​లో అజ్ఞాతంలోకి వెళ్లిన మోదీ.. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తరచూ మారువేషంలో ప్రయాణించారు. ఒకసారి సన్యాసిగా, ఒకసారి సిక్కు వేషధారణలో వెళ్లారని చాలా మంది చెబుతుంటారు.

1978: సూరత్, వడోదరలో కార్యకలాపాలను పర్యవేక్షించే ఆరెస్సెస్ సంభాగ్ ప్రచారక్ (ప్రాంతీయ నిర్వాహకుడు)గా మోదీ నియమితులయ్యారు.

1979 - దిల్లీలో ఆరెస్సెస్ కోసం మోదీ పనిచేశారు. అక్కడ ఎమర్జెన్సీలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకలాపాలను, చరిత్రను పరిశోధించి రాశారు.

1980- బీజేపీ ఆవిర్భవించింది.

1983: గుజరాత్ యూనివర్శిటీలో ఎక్స్​టర్నల్ స్టూడెంట్​గా పొలిటికల్ సైన్స్​లో మోదీ ఎంఏ పట్టా పొందారు.

1987- మోదీ బీజేపీలో చేరారు.

1988: గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా మోదీ నియమితులయ్యారు.

1992 డిసెంబర్: యూపీలోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత. రాముడి జన్మస్థలంలో మసీదును నిర్మించారని ఆందోళనకారులు ఆరోపించారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 2000 మందికి పైగా మరణించారు. వీటన్నింటికీ మోదీ దూరంగా, గుజరాత్​లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

1995: గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలకు గాను బీజేపీ 121 సీట్లు గెలుచుకుంది. మోదీ బీజేపీ ప్రధాన కార్యదర్శి అయ్యారు.

అక్టోబర్ 7, 2001: భూకంప సంక్షోభం నేపథ్యంలో గుజరాత్ సీఎం పదవికి కేశూభాయ్ పటేల్ రాజీనామా. వాజ్​పేయి, ఎల్​కే అద్వానీ సూచినతో మోదీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఫిబ్రవరి 24, 2002: గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాజ్ కోట్-2 నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశ్విన్ మెహతాపై మోదీ విజయం సాధించారు.

2002 ఫిబ్రవరి 27- గుజరాత్​లోని గోద్రాలో బాబ్రీ మసీదు కూల్చివేత కార్యక్రమం అనంతరం అయోధ్య నుంచి హిందూ యాత్రికులను తీసుకెళ్తున్న రైలు దగ్ధమైంది.

ఫిబ్రవరి 2002: గోద్రా ఘటన తర్వాత అల్లర్లు చెలరేగాయి. 1000 మందికిపైగా మరణించారు, వీరిలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. సీఎంగా అల్లర్లను అణచివేసేందుకు మోదీ తగిన చర్యలు తీసుకోలేదని స్థానికంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికీ ఇవి మోదీని వెంటాడుతుంటాయి.

ఏప్రిల్ 2002: గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ.. సీఎం పదవికి రాజీనామాను సమర్పించారు. కానీ దాన్ని ఆమోదించలేదు.

డిసెంబర్ 22, 2002: గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

2005: గోద్రా అల్లర్ల నేపథ్యంలో మోదీకి ట్రావెల్ వీసాను అమెరికా విదేశాంగ శాఖ తిరస్కరించింది.

జులై 2007 - గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ వరుసగా 2,063 రోజులు పూర్తి చేసుకున్నారు. ఆ పదవిలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.

2007: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 117 స్థానాల్లో విజయం సాధించింది. మోదీ మూడోసారి సీఎం అయ్యారు.

2008: రైతుల నిరసనల తరువాత నానో కారు తయారీ కర్మాగారాన్ని పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్​కు తరలించడానికి టాటా మోటార్స్​ని మోదీ ఒప్పించారు.

అక్టోబర్ 22, 2012: బ్రిటన్ హైకమిషనర్ జేమ్స్ బెవన్ మోదీతో సమావేశమై వ్యాపారం, పెట్టుబడులపై చర్చించారు. 2002 గుజరాత్ అల్లర్లలో ముగ్గురు బ్రిటిష్ పౌరులు మరణించిన తరువాత మోదీపై యుకె 10ఏళ్ల దౌత్య బహిష్కరణకు ఈ సమావేశం ముగింపు పలికింది.

డిసెంబర్ 2012: గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది.

జనవరి 7, 2013: యూరోపియన్ యూనియన్ రాయబారులు దిల్లీలోని జర్మన్ రాయబారి నివాసంలో మోదీతో కలిసి భోజనం చేశారు. మోదీపై దశాబ్దకాలంగా కొనసాగుతున్న అనధికారిక బహిష్కరణకు ఈ లంచ్ ముగింపు పలికింది.

జున్ 9, 2013: 2014 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించారు.

2014 మే- లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. వడోదర, వారణాసి నుంచి మోడీ గెలిచారు.

మే 18, 2014: మోదీపై దశాబ్దకాలంగా ఉన్న వీసా నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది.

2014 మే 26- భారతదేశ 14వ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు.

సెప్టెంబర్ 25, 2015 - బీజేపీ ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారాన్ని ప్రారంభించింది, భారతదేశాన్ని అత్యంత ఇష్టపడే ప్రపంచ ఉత్పాదక గమ్యస్థానంగా ప్రమోట్ చేసింది.

అక్టోబర్ 2, 2014: మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్​ను ప్రారంభించారు.

2015- మెరుగైన ఆన్​లైన్ కనెక్టివిటీ ద్వారా ప్రభుత్వ సేవలను ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ ఇండియా క్యాంపెయిన్​ని ప్రారంభించారు.

నవంబర్ 8, 2016 - జాతినుద్దేశించి టెలివిజన్ ప్రసంగంలో ప్రధాని మోదీ రూ.500, రూ.1000 నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

జూన్ 1, 2017 - వస్తు సేవల పన్ను ప్రవేశపెట్టబడింది. ఫెడరల్, స్టేట్ ట్యాక్స్ స్థానంలో జీఎస్టీ వస్తుంది.

ఫిబ్రవరి 14, 2029 - జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి జైషే మహ్మద్ సంస్థ బాధ్యత వహించింది. 2019 లోక్​సభ ఎన్నికలకు ముందు పాకిస్థాన్​లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై మెరుపు దాడికి మోదీ ఆదేశించారు.

మే 20, 2019: టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రధాని మోదీ దర్శనమిచ్చారు.

మే 30, 2019: లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి మోదీ మరో విజయాన్ని అందించారు. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆగస్టు 1, 2019 - ట్రిపుల్ తలాక్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ముస్లింలలో తక్షణ విడాకుల ఆచారాన్ని శిక్షార్హమైన నేరంగా చట్టం చేస్తుంది.

ఆగస్టు 5, 2019: జమ్ముకశ్మీర్​కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. నెలల తరబడి ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్లు నిలిచిపోయాయి.

నవంబర్ 9, 2019: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరాన్ని నిర్మించడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది.

డిసెంబర్ 11, 2019: ముస్లింలను మినహాయించి అణచివేతకు గురైన మతపరమైన మైనారిటీలకు పౌరసత్వ హక్కులు కల్పించే పౌరసత్వ సవరణ చట్టానికి లోక్​సభ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

2020 ఫిబ్రవరి- ఈశాన్య దిల్లీలో 53 మంది అల్లర్లకు పాల్పడ్డారు.

జూన్ 15, 2020: గల్వాన్ లోయలోని ఎల్ఏసీ వద్ద భారత్, చైనా దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగి 20 మంది భారత సైనికులు మరణించారు.

సెప్టెంబర్ 20, 2020: పార్లమెంట్​లో మూడు వ్యవసాయ చట్టాలు ఆమోదం పొందాయి. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హరియాణా రైతులు దిల్లీకి ర్యాలీగా బయలుదేరారు.

జూన్ 10, 2021: మహమ్మారి సెకండ్ వేవ్​లో భారతదేశంలో కోవిడ్ -19 మరణాలు ఒకే రోజులో 6,148 మరణాలకు చేరుకున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది.

నవంబర్ 9, 2021 - వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు.

2023 సెప్టెంబర్ 9-10 తేదీల్లో దిఢిల్లీలోని భారత్ మండపంలో 18వ జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించారు. మంత్రులు, సీనియర్ అధికారులు, పౌర సమాజాల మధ్య ఏడాది పొడవునా జరిగిన అన్ని జీ20 ప్రక్రియలు, సమావేశాలకు ఇది హైలైట్​.

జనవరి 22, 2024: అయోధ్యలో రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.

జూన్ 4, 2024 - మోదీ మూడవసారి గెలిచారు. కానీ బీజేపీ దశాబ్దంలో మొదటిసారి లోక్​సభలో మెజారిటీని కోల్పోయింది. బీజేపీకి 240 సీట్లు, మెజారిటీ మార్కుకు 272 సీట్లు తగ్గాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

జూన్ 9, 2024- మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘనతను ఆయన కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ మాత్రమే సాధించారు.

సంబంధిత కథనం