Haryana assembly polls: ‘‘హరియాణాలో కాంగ్రెస్ కే ఎడ్జ్; బీజేపీ నుంచి గట్టి పోటీ’’: పీపుల్స్ పల్స్ సర్వే-peoples pulse survey predicts edge for congress in haryana assembly polls and tough fight from bjp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Haryana Assembly Polls: ‘‘హరియాణాలో కాంగ్రెస్ కే ఎడ్జ్; బీజేపీ నుంచి గట్టి పోటీ’’: పీపుల్స్ పల్స్ సర్వే

Haryana assembly polls: ‘‘హరియాణాలో కాంగ్రెస్ కే ఎడ్జ్; బీజేపీ నుంచి గట్టి పోటీ’’: పీపుల్స్ పల్స్ సర్వే

Sudarshan V HT Telugu
Sep 20, 2024 08:07 PM IST

త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కొంత వరకు కాంగ్రెస్ కు సానుకూలత కనిపిస్తోందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. అయితే, బీజేపీకి కూడా విజయావకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా 26 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ ద్విముఖ పోరు నెలకొని ఉందని, అవే విజేతను తేలుస్తాయని వెల్లడించింది.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనా
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనా (HT_PRINT)

త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర సర్వే నివేదికను పీపుల్స్ పల్స్ సంస్థ వెలువరించింది. అందులో నియోజకవర్గాల వారీగా ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ల బలాబలాలను వెల్లడించింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో కొంత వరకు కాంగ్రెస్ కు సానుకూలత కనిపిస్తోందని తేల్చింది.

26 స్థానాల్లో గట్టి పోటీ..

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా విజయావకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ముఖ్యంగా 26 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ ద్విముఖ పోరు నెలకొని ఉందని, ఆ నియోజకవర్గాల్లో గెలుపోటములు, మొత్తంగా అధికారం చేపట్టే విజేతను తేలుస్తాయని ఆ సర్వే వెల్లడించింది.

కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరిది విజయం..

హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 46. కనీసం 46 సీట్లలో విజయం సాధించిన పార్టీ లేదా కూటమి అధికారం చేపడుతుంది. సెప్టెంబర్ 20 నాటికి రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఈ ఎన్నికల్లో గెలుపోటముల అవకాశాలపై పీపుల్స్ పల్స్ రిపోర్ట్ ఆసక్తికర అంచనాలను వెలువరించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో, 35 సీట్లలో కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపిస్తోంది, 23 సీట్లలో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోందని ఈ సర్వే తేల్చింది. స్వతంత్రులు 3 స్థానాల్లో, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి మరో 3 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. మిగతా 26 సీట్లలో హోరాహోరీ పోరు తప్పదని తేల్చింది. ‘‘అంటే, ఈ 26 సీట్లలో అత్యధిక సీట్లను గెల్చుకుంటే బీజేపీకి మళ్లీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ ఈ సారి, 10 ఏళ్ల తరువాత మళ్లీ అధికారంలోకి వస్తుంది’’ అని పీపుల్స్ పల్స్ తేల్చింది.

బీజేపీ మేనిఫెస్టో

హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. పార్టీ మేనిఫెస్టో సీరియస్ డాక్యుమెంట్ అని, బీజేపీ ఎప్పుడూ తన వాగ్దానాలను నెరవేర్చిందని, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని వాటిని కూడా అమలు చేసిందని నడ్డా అన్నారు. బీజేపీ నాయకత్వంలో హరియాణా మారిందన్నారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.37 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.3 లక్షలకు పెరిగిందన్నారు.

బీజేపీ హామీలు

హరియాణా ఎన్నికల్లో లాడో లక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు రూ.2,100, హర్ ఘర్ గృహిణి యోజన కింద రూ.500కే వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఓబీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన హర్యానా విద్యార్థులు దేశంలోని ఏదైనా ప్రభుత్వ మెడికల్ లేదా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవడానికి ఉపకార వేతనాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చింది. హర్యానాకు చెందిన ప్రతి అగ్నివీర్ కు గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని పేర్కొన్నారు.

అక్టోబర్ 5న పోలింగ్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి అక్టోబర్ 1న పోలింగ్ జరగాల్సి ఉంది. కాగా, హరియాణా రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువకుల కోసం ఏడు ప్రధాన హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. మహిళలు, వితంతువులు, వృద్ధులకు రూ. 6 వేల పెన్షన్, కనీస మద్దతు ధరల (MSP) చట్టం, కుల సర్వే, పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరణ మొదలైనవి అందులో ఉన్నాయి.

Whats_app_banner