Congress manifesto: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ బుధవారం తన మేనిఫెస్టోను ఆవిష్కరించింది. అందులో ప్రధానంగా ఏడు హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. వాటిలో రూ .500 కు నెలవారీ గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వృద్ధులు, వితంతు మహిళలు, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ మొదలైనవి ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఈ మేనిఫెస్టో (manifesto) విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
2014 లో తలసరి ఆదాయం, ఉద్యోగాలు, శాంతిభద్రతలు, క్రీడల్లో పెద్ద రాష్ట్రాల్లో హరియాణా నంబర్ వన్ గా నిలిచిందని కాంగ్రెస్ (congress) నేత భూపిందర్ హుడా అన్నారు. గత పదేళ్ల బీజేపీ, జేజేపీల పాలనలో పరిస్థితి తారుమారైంది. రెజ్లర్లు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. మల్లిఖార్జున ఖర్గే (mallikarjun kharge), రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హర్యానాను మళ్లీ నంబర్ వన్ గా మారుస్తామని హామీ ఇస్తున్నానన్నారు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలను ప్రకటిస్తారు.
టాపిక్