Cyclone Alert : ఒడిశాకు తుపాను హెచ్చరికలు.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Cyclone alert in Bay of Bengal : ఒడిశాకు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులు మే 23లోగా వెనక్కి తిరిగి రావాలని ఐఎండీ హెచ్చరికలు ఇచ్చింది. ఈ నెల 23 నుంచి 27 వరకు ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై తుపాన్ ప్రభావం ఉండనుందని స్పష్టం చేసింది.
Odisha cyclone alert : ఈ నెల 23న తీవ్ర తుపాను బంగాళాఖాతాన్ని తాకే అవకాశం ఉందని, ఉత్తర ఒడిశా- పశ్చిమబెంగాల్ తీరాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఐఎండీ విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. మత్స్యకారులుగురువారంలోగా వెనక్కి తిరిగి వచ్చేయలని, మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, మరింత ఈశాన్య దిశగా పయనించి మే 24 ఉదయం నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..!
ఒడిశా, పశ్చిమబెంగాల్ ఉత్తర భాగంలో తీరం వెంబడి ఈదురుగాలులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మే 23 నుంచి 24 వరకు మత్స్యకారులు ఈ తీరాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది. ఒడిశాతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లపై కూడా మే 23 నుంచి మే 27 మధ్య తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అందువల్ల మే 28, 2024 నాటికి గుజరాత్, ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Rains in Andhra Pradesh : ఇక మే 23 వరకు.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర తదితర రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో మే 23 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు మేర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మే 18న కురిసిన భారీ వర్షానికి తిరువనంతపురం నగరం, దాని శివారు ప్రాంతాలు వరదలతో అల్లాడిపోయాయి.
ఏపీలో వర్షాలు.. తెలంగాణలో ఎండలు..
Hyderabad temperature today : అల్పపీడన ప్రభావంతో రేపు విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
గత కొద్ద రోజులుగా చిరు జల్లులు, వర్షాలతో ఉపశమనం పొందుతున్న తెలంగాణ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా..మరి కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్ నగరంలో ఎండ వేడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం